SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయుల శిల్పకళా వైభవం

1 min read

హైదరాబాద్ : వరంగల్‌ జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. కాకతీయుల కాలం నాటి ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి, శిల్పకళా సౌందర్యానికి చెక్కు చెదరని సాక్ష్యంగా నిలిచిన ఈ దేవాలయం ఈ అరుదైన గుర్తింపును దక్కించుకుంది. యునెస్కో గుర్తింపుతో ఈ ఆలయం కాకతీయ శిల్ప కళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో వర్చువల్‌గా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్‌ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవగా.. భారత దేశం నుండి 2020 సంవత్సరానికి గాను రామప్ప దేవాలయాన్ని ఎంపిక చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. ములుగు జిల్లా పాలంపేటలో క్రీ.శ.1213లో నిర్మితమైన అపురూప కట్టడం.. శిల్పి రామప్ప పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం.. ఈ ఆలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించారు. 2019లో రామప్ప ఆలయాన్ని సందర్శించిన యునెస్కో ప్రతినిధుల బఅందం ఆ ప్రాంత పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కొన్ని ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాంత పరిరక్షణకు ప్రత్యేక అభివఅద్ధి అథారిటీ, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటుచేసింది.

రామప్పకు ప్రపంచ గుర్తింపు.. ప్రధాని మోదీ హర్షం

Total Page Visits: 160 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed