SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఏపీలో పార్టీ పెట్టకూడదని రూలేమైనా ఉందా?

1 min read

జగన్‌కు షర్మిల సవాల్‌?
రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టవచ్చు!
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఏర్పాటుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
జగన్‌తో విభేదాలపై ఇప్పటికే ప్రచారం
దానిని బలపరిచేలా షర్మిల సమాధానం
19 లేదా 20న పాదయాత్రకు సన్నాహాలు
నేటి రైతు ఆవేదన యాత్ర వాయిదా

హైదరాబాద్ : ‘జగనన్న వదిలిన బాణం’… ఇప్పుడు ఆ అన్నకే ఎదురు తిరగనుందా? తెలంగాణలో ఇప్పటికే రాజకీయ పార్టీ ప్రారంభించి.. పాదయాత్రలు, ధర్నాలతో హల్‌చల్‌ చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి సోదరి వైఎస్‌ షర్మిల తదుపరి అడుగు సీమాంధ్రలోనేనా? ‘తెలంగాణలో నేను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నావు. నేను ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టి నిన్ను బలహీన పరుస్తా!’ అని అన్నకు ఆమె సవాల్‌ విసిరినట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. దీనిని బలపరిచేలా షర్మిల ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని లోట్‌సపాండ్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీలో రాజకీయ పార్టీ పెట్టడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీలో పార్టీ పెడుతున్నారా?’ అని ప్రశ్నించగా… ‘రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టవచ్చు. పెట్టకూడదని నిబంధన (రూల్‌) ఏమీ లేదు కదా’ అని వ్యాఖ్యానించారు. వెరసి… ఏపీలో అడుగు పెట్టడంపై షర్మిల ఒకింత స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. ఇటీవల క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొనేందుకు ఇడుపులపాయ వెళ్లిన జగన్‌, షర్మిల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణలో షర్మిల ప్రారంభించిన వైఎస్సార్‌టీపీలోకి నేతల చేరికలు జరగకుండా అడ్డుకోవడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలాగైతే తానూ ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడతానని హెచ్చరించినట్లు సమాచారం. షర్మిల ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయడం గురించి గతంలో ప్రశ్నించినప్పుడు… ‘అన్న అక్కడ… నేను ఇక్కడ’ అన్నట్లుగా బదులిచ్చారు. ఈసారి మాత్రం.. ‘‘రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టవచ్చు. పెట్టకూడదని నిబంధన ఏమీ లేదు కదా’’ అని వ్యాఖ్యానించడం విశేషం.


మరోవైపు.. తెలంగాణలో ఈ నెల 19 లేదా 20 నుంచి తన పాదయాత్రను కొనసాగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు షర్మిల తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టుపై స్పందిస్తూ.. బీజేపీ, కేసీఆర్‌ దొందూ దొందేనన్నారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్‌ బీజేపీని టార్గెట్‌ చేస్తున్నారని చెప్పారు. నిబంధనల ప్రకారం రైతు ఆవేదన యాత్ర నిర్వహిస్తామని స్పష్టం చేసినా పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. రైతుబంధు పండగలకు మాత్రం నిబంధనలు అడ్డు రావా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఈ నిబంధనలని మండిపడ్డారు. కాగా, కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతుండడంతో మంగళవారం నుంచి నిర్వహించతలపెట్టిన రైతు ఆవేదన యాత్రను వాయిదా వేసుకున్నట్లు షర్మిల ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్‌లో చలనం లేదని షర్మిల ధ్వజమెత్తారు. నిరుద్యోగులు, రైతుల చావులకు కారకుడైన ఈ అహంకారి పాలన మనకు వద్దని అన్నారు. కేసీఆర్‌ అధికారాన్ని కూల్చేస్తేనే రాష్ట్రంలో చావులు ఆగుతాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో షర్మిల ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాలకు విద్యనందించడంలో సావిత్రిబాయి ఎనలేని సేవ చేశారని కొనియాడారు.
షర్మిలకు పోటీ చేసే హక్కు లేదా?: గట్టుటీఆర్‌ఎస్‌ మాజీ నేత గట్టు రాంచందర్‌రావు సోమవారం షర్మిల సమక్షంలో వైఎస్సార్‌టీపీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటలీలో పుట్టిన సోనియాగాంధీ దేశానికి నాయకత్వం వహించవచ్చు కానీ, తెలంగాణ గడ్డపై పుట్టిన షర్మిలకు పోటీ చేసే హక్కు లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య రహస్య పొత్తు ఉందని

Also read

Total Page Visits: 159 - Today Page Visits: 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed