SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కూకట్‌పల్లిలో ఘోరం.. నిలువెత్తు నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలి

1 min read

ఓ ఇంటి యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అయిన‌ సంఘటన కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..
ఓ ఇంటి యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అయిన‌ ఘటన కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్‌పల్లి విలేజ్ లో గల మూడు అంతస్తుల భవనం 3వ అంతస్తులో రెయిలింగుకు బీటలువారాయి. ఇదే విషయం ఆ ఇంటిలో అద్దెకు ఉండేవారు యజమానికి తెలియజేశారు. అయినా ఆ ఇంటి యజమాని నిర్లక్ష్యం వహించాడు.

రాత్రి 8 గంటల సమయంలో స్థానికంగా నివసించే రోజా(25) ఆ భవంతిలో గల ఎంబ్రాయడరి సెంటరుకు వచ్చింది. ఆ సమయంలో 3వ అంతస్తు పెచ్చులు ఊడి రోజా తలపై పడటంతో తీవ్రగాయాలయి అక్కడికక్కడే మృతి చెందింది. ‌


సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


  • http://www.sgstvtelugu.com/ఆంధ్రప్రదేశ్/కాకినాడ-జగన్నాధపురం-ఘాటీ/
Total Page Visits: 78 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed