SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

రాజేందర్‌ చిన్నోడు, అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు’

1 min read

కరీంనగర్‌/హైదరాబాద్‌: ఉప ఎన్నిక నేపథ్యంలో హుజురాబాద్‌పై పట్టు సాధించే దిశగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే రోజుకో మంత్రి నియోజకవర్గంలో పర్యటిస్తుండగా… దళిత బంధు పథకాన్ని మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గ దళితులతో ఈనెల 26న ఆయన సమావేశం కానున్నారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని గ్రామాల్లో నుంచి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల చొప్పున ఎంపిక చేసి.. 427 మందిని ఈ భేటీకి ఆహ్వానించారు.

ఇందులో భాగంగా… సమావేశానికి రావాలని సీఎం కేసీఆర్‌ దళిత సామాజిక వర్గ నేతలకు స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించడం విశేషం. జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన కార్యకర్త, ప్రస్తుత ఎంపీటీసీ భర్త వాసాల రామస్వామితో సీఎం కేసీఆర్ ఫోన్‌ చేసి మాట్లాడారు. ప్రగతిభవన్‌కు బయల్దేరేముందు జూలై 26న మండల కేంద్రాల్లో సమావేశమై ప్రత్యేక బస్సుల్లో హుజురాబాద్‌కు చేరుకొని, అంబేద్కర్ విగ్రహానికి పూల దండ వేసి హైదరాబాద్‌కు రావాలని సూచించారు.

‘‘దళిత జాతి భవిష్యత్తు దళిత బంధుపై ఆధారపడి ఉంది. కాబట్టి స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్లాలి. హుజురాబాద్‌ నియోజకవర్గం తర్వాత రాష్ట్ర వ్యా‍ప్తంగా అమలు చేస్తాం’’ అంటూ సీఎం కేసీఆర్‌ రామస్వామికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా.. మాజీ మంత్రి, హుజురాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తన పట్ల వ్యవహరించిన తీరును రామస్వామి ప్రస్తావించగా… ‘‘రాజేందర్‌ చిన్నోడు. అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని ఆయన బదులిచ్చారు.

Also read

Total Page Visits: 133 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed