SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు తెలంగాణలో కొత్త డ్రామా ఆడుతోంది : జగ్గారెడ్డి

1 min read

రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో కొత్త డ్రామా ఆడుతోందని వ్యాఖ్యానించారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో కొత్త డ్రామా ఆడుతోందని వ్యాఖ్యానించారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ‘జగన్మోహన్ రెడ్డి- కేసీఆర్ – షర్మిల’ బీజేపీ నీడలో ఉన్నారని జగ్గన్న చెప్పుకొచ్చారు. అంతర్గతంగా ముగ్గురు చర్చలు జరిపి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇవాళ జగ్గారెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

నీళ్లు – నిధులు – నియామకాలు అనే పేరుతో కేసీఆర్ ఉద్యమం చేపడితే కాంగ్రెస్ అండగా నిలబడిందన్న జగ్గారెడ్డి.. గతంలో అన్నదమ్ముల వలె భోజనాలు చేశారు – మళ్ళీ భోజనాలు చేసుకుంటూ సమస్యలు పరిష్కరించాలని జగ్గారెడ్డి ఏపీ – తెలంగాణ కృష్ణాజలాల వివాదంపై వ్యాఖ్యానించారు.


“టీఆరెస్ మంత్రులకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ కంటే మూర్ఖుడు అనేది ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? ప్రగతి భవన్ కు వచ్చిన్నపుడు గుర్తుకు లేదా?. పీజేఆర్- వైఎస్సార్ మధ్య జల వివాదం కంటే రాజకీయ వివాదమే ఎక్కువ ఉండేది. ముఖ్యమంత్రి కావాలనుకునే నేతలు పీజేఆర్- వైఎస్సార్.” అని జగ్గారెడ్డి గతాన్ని నెమరువేసుకున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా పార్టీలు మారరని చెప్పిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ చేసిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే జల వివాదాలు ఉండవన్నారు

Total Page Visits: 88 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed