SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో థౌజండ్ వాలా పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

1 min read

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో థౌజండ్ వాలా పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవును అక్కడ వెయ్యి మందిని పోటీకి నిలుపుతామంటూ పటాకా పేల్చారు…

Also read


హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో థౌజండ్ వాలా పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవును అక్కడ వెయ్యి మందిని పోటీకి నిలుపుతామంటూ పటాకా పేల్చారు ఆర్ కృష్ణయ్య. ఇప్పటి వరకూ ఎంతో సైలెన్స్ మెయిన్‌టైన్ చేసిన బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య సడెన్‌గా ఎంట్రీ ఇచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికమీద స్పందించడం మాత్రమే కాదు.. హుజూరాబాద్‌ను ‘హజరతా బాద్’… అంటే వెయ్యి మందిని ఉపఎన్నిక నిలుపుతామని ప్రకటించారు. దీంతో ఎక్కడి అభ్యర్ధులక్కడే గప్ చుప్ అయిపోయారు. దీంతో ఇదెక్కడి గొడవ? అని తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇలాంటి ఎన్నికల కారణంగా అక్కడి ఎన్నికల ఫలితాలు ఎంతటి ప్రభావితం అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ తరహా ఎన్నిక వార్త హుజూరాబాద్ లోనూ వెలుగులోకి రావడంతో.. ఇదో చర్చగా మారింది.

కొన్నాళ్ల క్రితం ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించింది ప్రభుత్వం. తద్వారా 7600 మంది ఉపాధి కోల్పోయారని.. ఇందుకు తగిన సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు ఆర్ కృష్ణయ్య. వీరందరినీ విధుల్లోకి తీసుకోకుంటే తాము వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లను.. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దింపుతామని హెచ్చరించారు. వీరితో పాటు ఇటీవల తొలగించిన స్టాఫ్ నర్సులు సైతం నామినేషన్లు వేసే అవకాశముందని హెచ్చరించారు కృష్ణయ్య. ఒక వేళ అదే జరిగితే.. న్యూస్ పేపర్ సైజు బ్యాలెట్ పేపర్లు, నీళ్ల డ్రమ్ముల సైజు బ్యాలెట్ బాక్సులు, గుర్తును పోలిన గుర్తులు, పేర్లను పోలిన పేర్లతో నానా తంటాలు పడాల్సి వస్తుంది. కాబట్టి.. ఇలాంటి పరిస్థితి రావద్దనే ఆశిస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్ధులు.

ప్రజల గుండెల్లో నన్ను చెరపడం జేజమ్మ తరం కూడా కాదు

Total Page Visits: 217 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed