SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ట్రాఫిక్ జామ్ లో చిక్కున్న అంబులెన్స్ .. దారి ఇవ్వడానికి ప్రోటోకాల్ అడ్డు అంటూ పోలీసు వాదన

1 min read

ప్రభుత్వమైనా , అధికారులైనా ప్రజల కోసం పనిచేయాలి.. ప్రజల ధన,మాన ప్రాణాల రక్షణకు అండగా నిలబడాలి. ప్రజల కష్ట, నష్టాల్లో ఆదుకుంటూ మానవత్వం తో పనిచేసే అధికారులున్నారు.. వారిగురించి మనం తరచుగా వింటూనే ఉన్నాం.. అయితే కొంతమంది పోలీసు ప్రోటోకాల్ పేరుతో ప్రాణాపాయ స్థితిలో రోగిని తీసుకుని వెళ్తున్న అంబులెన్స్ ను అడ్డుకున్నారు. తమకు ప్రోటోకాల్ ముఖ్యమని చెప్పఁడంతో ప్రస్తుతం పోలీసుల తీరు పై సర్వత్రా నిరసన వ్యక్తం మవుతుంది ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మసబ్ ట్యాంక్ వద్ద ప్రాణ పాయ స్థితిలో ఉన్న రోగిని అంబులెన్స్ ఆస్పత్రికి తరలిస్తోంది. ఈ నేపథ్యంలో అంబులెన్స్ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుంది. సమయానికి రోగికి చికిత్స అందించక పొతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని భావించిన అంబులెన్స్ లోని వైద్య సిబ్బంది.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద విధులను నిర్వహిస్తున్న ట్రఫిక్స్ సిబ్బందిని దారి ఇవ్వమని బతిమిలాడారు. అయినప్పటికీ ట్రాఫిక్ సిబ్బంది మనసు కరగలేదు.. మానవత్వం మాట మరచిపోయారు. దారి ఇవ్వాల్సిందిగా అంబులెన్స్ దిగి వచ్చి విధి నిర్వహణ లో పోలీసులను బతిమిలాడి న వైద్యులకు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల తీరుపై అక్కడనున్న వాహనదారులు మండిపడుతున్నారు. ప్రజల కోసమే అధికారులు కానీ.. ప్రోటోకాల్ అంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు లేదని అంటున్నారు.

Also read

Total Page Visits: 222 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed