SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ములుగు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు

1 min read

మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి: ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఐపిఎస్ . ఈరోజు అనగా తేదీ 04.06.2021 రోజున జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఐపీఎస్ గారి ముందు మణుగూరు స్పెషల్ గెరిల్లా దళానికి చెందిన మడకం నంధాల్ అనే మావోయిస్టు లొంగిపోయాడు. మడకం నంధాల్ @ నందు,S/o దేవ,వయసు:20, గొత్తి కోయ R/O కౌరు గుట్ట గ్రామము, మండలం పామెడు,జిల్లా బీజాపూర్, చత్తిస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఇతని చిన్నతనంలో తల్లి మరణించింది. మావోయిస్టు అనుబంధ సంస్థ బాలల సంఘంలో మూడు సంవత్సరాలు పని చేశాడు. ఇతని తండ్రి బాగా తాగి రోజు ఇతనిని కొట్టడం వల్ల ఇతని దగ్గర బంధువు పరిచయంతో పసర దగ్గర గుండ్ల వాగు ప్రాజెక్టు లో పని చేసుకుంటూ బూడిద గడ్డ గొత్తి కోయ గుంపులో ఉన్నాడు. అనంతరం ఛత్తీస్ ఘడ్ లో సోముడు అనే మావోయిస్టు పరిచయం ద్వారా 2018 సంవత్సరంలో చెర్ల అరుణక్క దళంలో దళ సభ్యుడిగా చేరి సంవత్సరం పని చేసిన తర్వాత తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ అయిన ఆజాద్ ఆదేశాల మేరకు మణుగూరు దళంలో స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ లచ్చన్న కు గార్డుగా పని చేశాడు . లచ్చన్న కు గార్డుగా పనిచేసిన సమయంలో ఇతను బట్టుమ్ ఫైరింగ్, పెద్దమిడిసిలేరు రోడ్ బ్లాస్టింగ్ లో, జెర్రం ఏరియా టేకులగూడెం వద్ద జరిగిన కాల్పులలో 24 మంది CRPF కానిస్టేబుల్స్ చనిపోయిన సంఘటనలొ కూడా పాల్గొన్నాడు.ఇతను అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సరైన వైద్యం అందక మావోయిస్టు పార్టీనీ విఢాలని నిర్ణయించుకొని శుక్రవారం ములుగు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయాడు. లొంగిపోయిన అనంతరం ఇతనితో మాట్లాడగా మావోయిస్టు పార్టీలో చాలామంది కరొనా వ్యాధి తో బాధపడుతున్నారని మావోయిస్టు పార్టీ సరైన వైద్యం అందించకపోవడం వలన చాలామంది యూజీ క్యాడర్ మావోయిస్టులు మరణిస్తున్నారని తెలిపాడు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుండి అందవలసిన ప్రోత్సాహకాలను అందజేస్తామని మావోయిస్టులు అజ్ఞాత వాసాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చాడు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఓ ఎస్ డి శ్రీ శోభన్ కుమార్,ములుగు ఏ ఎస్పి శ్రీ పోతరాజు సాయి చైతన్య ఐపిఎస్, ఏఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ పాల్గొన్నారు.

Total Page Visits: 42 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed