SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహ

1 min read

ఫీజు కోసం అప్పు చేసిన తండ్రి.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య..



వనపర్తి (హైదరాబాద్‌) : కళాశాల ఫీజు కోసం తండ్రి అప్పు చేయడంతో మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మధుసూదన్‌ తెలిపిన వివరాల మేరకు… వనపర్తి పట్టణంలోని హరిజనవాడకు చెందిన లావణ్య (21) హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌ క్లాసులు వింటోంది. ఆమె తండ్రి వెంకటయ్య కానాయపల్లిలోని మిషన్‌ భగీరథ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా, తల్లి ఈశ్వరమ్మ స్థానికంగా కూలి పనిచేస్తూ కూతురిని, కుమారుడిని చదివిస్తున్నారు. సోమవారం ఉదయం కళాశాల ఫీజు కోసం లావణ్య, తండ్రిని డబ్బులు అడిగింది. దీంతో ఆయన రూ.8 వేలు అప్పుగా తెచ్చి కూతురుకు ఇచ్చి పనికి వెళ్లాడు. తల్లి, తమ్ముడు కూడా బయటకు వెళ్లారు. ఈ క్రమంలో తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి మనస్థాపానికి గురైన లావణ్య నిన్న మధ్యాహ్నం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు లావణ్య సెల్ఫీ వీడియో తీసుకుంది. కొద్దిసేపటికి స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Total Page Visits: 60 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed