SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పాటకు ప్రాణం పోసిన కవి దాశరథి

1 min read

హైదరాబాదు

మానవీయ జీవితాలనే ప్రతిబింబించేలా తన రచనలు గుప్పించి, పాటలకే ప్రాణంపోసి, తను సంగీత, సాహిత్య, ప్రజా సేవకుల హృదయాల్లో ఇప్పటికీ సజీవంగా యున్న దాశరథి కృష్ణమాచార్యుల జీవితం గొప్ప సందేశాత్మక మైనదని ప్రముఖ కవయిత్రి రేడియో వ్యాఖ్యాత అయినంపూడి శ్రీలక్ష్మి అన్నారు.
దాశరధి కృష్ణమాచార్య జయంతిని పురస్కరించుకొని భాషా సాంస్కృతిక శాఖ,
అక్షర యాన్,
అక్షర కౌముది సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మల్కాజ్ గిరి అంతర్జాల వేదిక ద్వారా జాతీయస్థాయిలో బాలలకు, పెద్దలకు రెండు విభాగాల్లో పాటల పోటీలను నిర్వహించగా
ఈ కార్యక్రమంలో అయినంపూడి శ్రీలక్ష్మి మాట్లాడుతూ తెలుగు సాహిత్య లోకంలో దాశరధి కృష్ణమాచార్య సాహిత్యాన్ని ఏనాటికీ మరువలేమని అన్నారు.
పాటైనా పద్యమైనా గేయమైనా వారికి సాటి ఎవరూ లేరని అన్నారు. ఆనాటి నిజం పాలకుల ఆగడాలను అరికడుతూ కలం చేత గళంతో సమాజాన్ని చైతన్య పరిచిన సాహితీమూర్తి దాశరథి కృష్ణమాచార్యులనీ, వారి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న
భాషా సాంస్కృతిక శాఖ,
అక్షర యాన్,
అక్షర కౌముది సంస్థల ప్రతినిధులు ఎంతో అభినందనీయులని అన్నారు.
తెలుగు వెలుగు సాహిత్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పక్కి రవి శేఖర సత్యనారాయణ మూర్తి,
ఎస్వీ ఫౌండేషన్ ఛైర్మన్ మోటూరి నారాయణరావు పాల్గొని ప్రసంగించారు.
ఈ జాతీయ స్థాయి దాశరథిపాటల పోటీలకు, పాఠశాల కళాశాలల విద్యార్థులూ,
పెద్దలూ మూడువందల పన్నెండు మంది ఆలపించీ, వీక్షకులను రంజింపజేసారు.
వీరిలో విజేతలకు నగదు పారితోషికం, ప్రశంసా పత్రాలనూ అందజేస్తున్నట్లు
అక్షర యాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి విశ్వైక ,
ప్రతినిధి ప్రవలిక,
అక్షర కౌముది సంస్థ అధ్యక్షులు
తులసి వెంకటరమణా చార్యులు,
ప్రధాన కార్యదర్శి
మూర్తి శ్రీదేవి, కోశాధికారి ముదిగొండ సంతోష్,
ప్రచార కార్యదర్శి
గడ్డం వెంకటరమణ,
రాజేంద్ర ప్రసాద్,
టి.వెంకటకృష్ణలు పాల్గొని దాశరథి కృష్ణమాచార్య జీవితాంశాలను వివరించారు. న్యాయనిర్ణేతలుగా
శశిశ్రీ, దేవిశ్రీ,
కుదమ తిరుమలరావు, రత్నమాల,
కోడూరు సుమన, రాచూరి శ్రీదేవి,
వ్యవహరించారు.

Total Page Visits: 90 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed