SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నిత్య అన్వేషి కవి: —–దాస్యం సేనాపతి..!
హైదరాబాదు

1 min read



కవిత్వం అంటే సమాజ శ్రేయస్సును కోరుతూ , అక్షర పద బంధాలను చక్కని ఆకృతిగా రచన చేయడమే కవిత్వం అని ప్రముఖ కవి ,రచయిత ,విమర్శకులు దాస్యం సేనాధిపతి అన్నారు. ఆదివారం మల్కాజ్ గిరి అక్షర కౌముది సాహిత్య సామాజిక సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో వచన కవిత్వ నిర్మాణ క్రమం పై కార్య శాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవిత్వం రాసేవారు అక్షర విషయ ప్రాధాన్యత కల్గజేస్తూ,
శీర్షిక, ఎత్తుగడ, సందేశాన్నిచ్చే ముగింపులతో కవిత్వపు నడక సాగాలని వారు అన్నారు.
మంచి సాహిత్య సృజన, పదజాలంపై పట్టు, భావవ్యక్తీకరణ ఆసక్తికరమైన రీతిలో కవిత అల్లికలుండాలని ఆయన అన్నారు.
నిత్య అన్వేషి కవి ఎప్పటికప్పుడు కవులు రచయితలు కొత్త పద ప్రయోగాలు చేస్తూ అనేక గ్రంథాలు అధ్యయనం చేయాలి అని అన్నారు.
కవిత్వ రచన రాశి కంటే వాసి ముఖ్యమని అన్నారు.
పద్య సాహిత్యం కి ఎంత ఆదరణ ఉన్నదో ,అదే రీతిలో వచన కవిత్వ రచనకు కూడా అంత ప్రాధాన్యత ఉన్నదని ఆయన అన్నారు.కుందుర్తి ఆంజనేయులు, శ్రీ శ్రీ ,సి నా రె వంటి ఎందరో ప్రముఖ కవులు వచన కవిత్వానికి ప్రాణం పోశారు అని అన్నారు.
చైతన్యవంతమైన సమాజం కోసం నిరంతరం సాహిత్య కృషి చేస్తూ ఎన్నో ప్రజోపయోగ అంశాలపై విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్షర కౌముది సంస్థ సేవలు చేస్తూ ఉండడం ఎంతో అభినందనీయం అని అన్నారు.
అక్షరకౌముది సంస్థ అధ్యక్షులు తులసి వెంకట రమణాచార్యులు మాట్లాడుతూ నేటి కాలంలో విభిన్న ప్రక్రియల్లో కవిత్వం వస్తుంది అయితే మంచి భావుకత , సాహిత్య సృజన కల్గిన రచనలు వస్తె మంచిదని భావించి .నేటి వర్ధమాన ,నవ కవులకు చకనైనా చిక్కటి కవిత్వాన్ని ఎలా రాయాలి అనే సందేహాలను నవృత్తి చేయడానికే అక్షర కౌముది సంస్థ ముందడుగు వేసి విషయ నిపుణుల ద్వారా ఈ కార్య శాల ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమ ఆవశ్యకతను వివరించారు.
సహస్ర కవిమిత్ర కుదమ తిరుమలరావు మాట్లాడుతూ
కవితాంశంపై అవగాహన సాధించీ, సొంత శైలితో రచించాలని, అంత్యప్రాసలకైప్రాకులాడరాదని
అన్నారు..
ఈకార్యక్రమంలో సంస్థ ప్రధాన
కార్యదర్శి మూర్తి శ్రీదేవి ,ఉపాధ్యక్షులు మేనా వత్ రాందాస్ ,తాళ్లూరి వెంకట కృష్ణ, కోశాధికారి ముదిగొండ సంతోష్ కుమార్ శర్మ, సాంకేతిక కార్యదర్శి గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్, ప్రచార కార్యదర్శి గడ్డం రమణ,
కవులు
కొంపెల్లి రామయ్య,
సృజామి సత్యనారాయణ,
దాసరి మోహన్, దేవిశ్రీ,
వల్లాల విజయలక్ష్మి,
పేరిశెట్ల శివకుమార్,
డి. దైవాదీనం,
నాశబోయిన నరసింహం,
పరాంకుశం రఘునారాయణ,
పిల్లి హజరత్తయ్య,
లక్ష్మీ పద్మజ,
అయిత అనిత,
ఎం.గోపాల్ రెడ్డి,
డా.శుభశ్రీ రాజన్ తో పాటు దాదాపు 60 మంది కవులు తదితరులు పాల్గొన్నారు.

Also read

Total Page Visits: 70 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed