SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

తెలుగు విద్యార్థినికి అమెరికా కాలేజీ రూ.2 కోట్ల స్కాలర్‌షిప్

1 min read

హైదరాబాద్: తెలంగాణాకు చెందిన శ్వేతా రెడ్డి(17) అనే విద్యార్థినికి అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ కాలేజీ ఏకంగా 2 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ను ఆఫర్ చేసింది. లాఫాయేట్ కాలేజీలో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ(మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్) కోర్సులో అడ్మిషన్‌తో పాటు ఈ స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. డైయర్ ఫెలోషిప్ పేరిట కాలేజీ ఇచ్చే ఈ స్కాలర్‌షిప్‌కు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఆరుగురు ఎంపికవగా అందులో శ్వేతారెడ్డి ఒకరు. హైస్కూల్ స్థాయిలో శ్వేతారెడ్డి కనబరిచిన ప్రతిభ, నాయకత్వ లక్షణాలు తమను మెప్పించాయని లాఫాయెట్ కాలేజీ యాజమాన్యం తెలిపింది.

కాగా.. ఈ స్కాలర్‌షిప్‌ సాధించడం పట్ల శ్వేత హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. తనకు ఇటువంటి అద్భుత అవకాశం రావడం వెనుకు డెక్స్‌టెరిటీ గ్లోబల్ సంస్థ ఇచ్చిన శిక్షణ, ప్రోత్సాహం ఎంతో ఉందని ఆమె పేర్కొన్నారు. డెక్స్‌టెరిటీ టూ కాలేజ్ అనే కేరిర్ డెవలప్‌మెంట్‌ కార్యక్రమంలో చేరిన శ్వేత నాలుగేళ్ల పాటు శిక్షణ పొందారు. ఈ క్రమంలో నాయకత్వ పటిమతో పాటు సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోగలిగానని శ్వేత పేర్కొన్నారు. కేరిర్‌లో తనకు మార్గదర్శిగా నిలిచిన డెక్స్‌టెరిటీ గ్లోబల్ సంస్థ సీఈఓ శరద్ సాగర్‌కు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు.

కాగా.. శ్వేతకు స్కాలర్‌షిప్‌ రావడం పట్ల డెక్స్‌‌టెరిటీ సీఈఓ శరద్ సాగర్ హర్షం వ్యక్తం చేశారు. రాబోయే తరాల నాయకులను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కేరీర్‌కు సంబంధించి తన సంస్థ ఇచ్చిన ట్రెయినింగ్‌తో ఎంతో మంది కొలంబియా, యేల్ యూనివర్శిటీ, జార్జి టౌన్, టఫ్ట్స్, కేస్ వెస్టర్న్, నార్త్‌వెస్టర్న్, యూనివర్శిటీ ఆఫ్ టొరంటో, బోస్టన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ లండన్, తదితర ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందారని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :

Total Page Visits: 273 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed