SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా

1 min read

హైదరాబాద్‌ : ఎపి సిఎం జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదాపడింది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి సిఎం జగన్‌ బెయిల్‌ ను రద్దు చేయాలని కోరుతూ… ఎంపి రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదాపడింది. విచక్షణ మేరకు చట్ట ప్రకారం పిటిషన్‌లోని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని సిబిఐ గతంలో కోర్టుకు వివరించింది. తాము కూడా లిఖితపూర్వకంగా వాదనలు సమర్పిస్తామని.. పది రోజుల సమయం ఇవ్వాలని ఈ నెల 14 న కోర్టును సిబిఐ కోరింది. అంగీకరించిన సిబిఐ కోర్టు నేటికి వాయిదా వేసింది. రఘురామకృష్ణరాజు, జగన్‌ తరఫు న్యాయవాదులు ఇప్పటికే తమ వాదనలను కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించిన విషయం తెలిసిందే. లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు సిబిఐ మరింత సమయం కోరడంతో విచారణను మళ్లీ ఈ నెల 30 కి సిబిఐ కోర్టు వాయిదా వేసింది.

Also read

Total Page Visits: 132 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed