SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఓబీసీ ఆంశంపై సానుకూలంగా స్పందించిన ఎన్ సీ బీసీ కమిషన్ సభ్యులు——-తల్లోజు ఆచారి

1 min read

హైదరాబాదు

శిష్టకరణ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు పార్లమెంట్ కు ప్రతిపాదనలను పంపించటం జరిగిందని ఎన్ సీ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి గారు తెలిపారు. జాతీయ శిష్టకరణ ఓబీసీ సాధన కమిటీ కన్వీనర్ శ్రీ డీ వీ కృష్ణారావు గారి నాయకత్వంలో జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ సభ్యులు మాన్యశ్రీ తల్లోజు అచారి గారిని శుక్రవారం ఆయన నివాసంలో కలవటం జరిగింది. ఈ సందర్భంగా తల్లోజు ఆచారి గారితో ఓబీసీ ఆంశాన్ని సుదీర్ఘంగా చర్చించటం జరిగింది. ఈ విషయమై ఆయన సానుకూలంగా స్పందించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో శిష్టకరణ ఓబీసీ జాబితాలో చేర్చే అంశంపై పార్లమెంట్ కు ఎన్ సీ బీసీ సిపార్సులను పంపించటం జరిగిందని, ఓబీసీ లో శిష్టకరణాలను చేర్చే ప్రక్రియ తుది దశకు చేరినట్టు ఆయన వెల్లడించారు. ఎన్ సీబీసీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి గారిని కలిసిన వారిలో జాతీయ శిష్టకరణ ఓబీసీ సాధన కమిటీ కన్వీనర్ శ్రీ డీ వీ కృష్ణారావు గారితో పాటు తెలంగాణ రాష్ట్ర శిష్టకరణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బి. విజయ్ కుమార్ గారు , కోశాధికారి ఉరిటి పార్వతీశ్వరరావు గారు , అడిషనల్ ప్రధాన కార్యదర్శులు డొంకాడ అనంత ప్రసాద్ గారు మోటూరి నారాయణ రావు గారు, తమిర్సి ప్రతాప్ రాజ్ గారు, పలువురు సంఘ సభ్యులు ఉన్నారు

Total Page Visits: 24 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed