SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఎల్.రమణ రాజీనామా కొత్త విషయం ఏమీ కాదు…కాట్రగడ్డ ప్రసూన

1 min read

రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన విలేకరుల సమావేశం వివరాలు ఎల్.రమణ రాజీనామా కొత్త విషయం ఏమీ కాదు. తెలుగుదేశం పార్టీ రాజకీయ సిద్ధాంతాలపై మాట్లాడుతుందే తప్ప చిల్లర మాటలు మాట్లాడే సంస్కారం మా పార్టీకి ఉండదు. 2018 సంవత్సరంలోనే జగిత్యాల టికెట్ తీసుకొని టీఆర్ఎస్లోకి వెళ్లాలనే ఆలోచన రమణ చేశారని వార్తలు వచ్చాయి. రమణ టీఆర్ఎస్కు కోవర్ట్గా పనిచేశారని అర్థం అవుతోంది. నెమ్మది, నెమ్మదిగా పార్టీ నాయకులను టీఆర్ఎస్ లోకి పంపించారనే అనుమానాలూ వస్తున్నాయి. పార్టీ నుంచి వెళ్లిన వారి గురించి భయపడే పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. సకల జనుల సమ్మె చేసిన స్వామిగౌడ్, ఈటెల రాజేందర్ వంటి బీసీ నాయకులను పక్కన పెట్టి ఇప్పుడు ఎల్. రమణను బీసీ నాయకుడిగా తీసుకుంటున్నామని మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి నాయకులను తయారు చేసే శక్తి లేదా? తెలుగుదేశం పార్టీ అనే విశ్వవిద్యాలయంలో సమర్థులు ఉంటారని మా నాయకులను తీసుకుంటున్నారు. విశ్వవిద్యాలయంలో పాత బ్యాచ్లు పోతుంటాయి… కొత్త బ్యాచ్లు వస్తుంటాయి. నిజామాబాద్ లో కూతురు ఓడిపోతుందని గతంలో మండవ వెంకటేశ్వరరావు అవసరం అయ్యాడు. తరువాత పక్కన పెట్టేశారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని రమణ అంటున్నారు. అందరూ కలిసి పోరాటం చేయడం వల్లే తెలంగాణ వచ్చిందని మర్చిపోయారా? తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేసి ప్రజలను బానిసత్వం నుండి విముక్తి చేసిన పార్టీ. గ్రామ వికాసానికి పాటు పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేసుకోబోతున్నాం. పార్టీ ప్రారంభోత్సవ సభలో షర్మిల మాట్లాడుతూ గాజులు తొడుక్కొని ఉన్నారా? అని మాట్లాడారు. నూతన శకాన్ని ప్రారంభిస్తున్నామంటూ మాట్లాడిన షర్మిల గాజులు
తొడుక్కొని ఉన్నారా.. అని మాట్లాడడం స్త్రీలను అవమాన పర్చడం కాదా? బలమైన శత్రువును ఓడించడానికి జగన్, కేసీఆర్ కలిశారని చెప్పారు. ఈ రాజకోట రహస్యాన్ని షర్మిల చెప్పినందుకు ఆమెకు కృతజ్ఞతలు. జగన్మోహన్రెడ్డి, షర్మిల వేరువేరు అని మేము అనుకోవడం లేదు. 2006లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మాకు మిగులు జలాలు అసవరం లేదని వైఎస్ రాజశేఖరరెడ్డి లేఖ ఇవ్వలేదా? దీనిని షర్మిల మరిచిపోయారా? గతంలో కౌగిలింతలు, విందులు.. ఇప్పుడు జలాల జగడాలు పెట్టుకోవడం చూసి ఈ నాటకాలు ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ రెపరెపలాడించుకుంటాం. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గన్నోజు శ్రీనివాస

చారి, జివిజి నాయుడు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ నాయుడు, మహిళా

విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత పాల్గొన్నారు.

Read also

Total Page Visits: 65 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed