SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఈనెల 8న YS షర్మిల తెలంగాణలో ప్రారంభించబోయే… పార్టీ జెండా…!

1 min read

“తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు

“తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు షర్మిల హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. గత ఫిబ్రవరి నుంచి ఆమె పార్టీ ఏర్పాటుకు ముమ్ముర కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామనే నినాదంతో ముందకు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేశారు. నిరుద్యోగుల సమస్యపై దీక్ష కూడా చేశారు. కాగా జులై 8 వైయస్సార్ జయంతి సందర్భంగా పార్టీని లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని పేరు కన్ఫామ్ చేశారు. పార్టీ విధి విధానాలు కూడా జులై 8న తెలియనున్నాయి. ఈ క్రమంలో పార్టీ జెండా గురించి లీకులు అందుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రంగు 80 శాతం, 20 శాతం నీలం రంగుతో పార్టీ జెండా రూపొందించినట్లు పార్టీ వర్గాలు నుంచి సమాచారం అందుతోంది. జెండా మధ్యలో తెలంగాణ భౌతిక స్వరూపం, అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రం ఉండేలా డిజైన్ చేశారు.

Ysrtp
తెలంగాణలో పాలపిట్టకు అత్యంత ప్రాధాన్యం ఉంది. దసరా రోజున పాలపిట్టను చూడటం అనాదిగా వస్తున్న ఆచారం. ఎప్పుడో గానీ కనిపించని ఈ అరుదైన పక్షి.. విజయ దశమి నాడు కచ్చితంగా దర్శనమివ్వడం మరో ప్రత్యేకత. ఈ పర్వదినం రోజున ఊరు శివార్లలోని పంట పొలాల్లో తళుక్కున మెరిసి జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ పక్షి. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను శుభాలకు, విజయాలకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడటాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు.”

Total Page Visits: 109 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed