SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఆధునిక బాల సాహిత్య వ్యాప్తినేటి అవసరం : కిలపర్తి దాలి నాయుడు

1 min read

*ఆధునిక బాల సాహిత్య వ్యాప్తినేటి అవసరం : కిలపర్తి దాలి నాయుడు*

👉అంతర్జాలం ద్వారా బాల సాహిత్య కార్యక్రమం
👉 చక్కని విశ్లేషణ అందించిన మీసాల చిన గౌరి నాయుడు



ఆధునిక బాలసాహిత్యం గద్య, పద్య, గేయ రూపంలో విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. పిల్లలకు సరళమైన భాషలో రచనలు చేసి బాల సాహిత్యాన్ని ఎక్కువగా వెలుగులోకి తెచ్చింది ఈ కాలంలోనే రామాయణ, మహాభారత, భాగవత కథలను పిల్లలకు అర్థమయ్యే విధంగా ఎందరో రచయితలు సులభ శైలిలో రచించి అందించారు. ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో అనేక బాలసాహిత్య రూపాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని ప్రాచుర్యంలోకి తెచ్చాయి.అందులో భాగంగానే తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో శనివారం నాడు జన దీపిక, ఎస్ వి ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో భాగంగా బాల సాహిత్యం బాలగేయాలు కవితాపఠనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి రచయిత విశ్లేషకులు విమర్శకుడు కిలపర్తి దాలినాయుడు అలాగే సహవిశ్లేషకులు మీసాల చిన గౌరీ నాయుడు ఆధ్వర్యంలో సుమారు 170 కవులు పాల్గొన్నారని ప్రముఖ కవి, విశ్లేషకులు కిలపర్తి దాలినాయుడు తెలిపారు.ఈ కార్యక్రమం ఎస్ వీ ఫౌండేషన్ ఛైర్మన్, కవి, రచయిత, వ్యాఖ్యాత మోటూరి నారాయణ రావు పర్యవేక్షణలో సజావుగా కొనసాగింది అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా లంక వెంకటస్వామి,గంటా మనోహర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నవనీత రవీందర్ చెళ్లపిళ్ల సుజాత, చొప్పదండి రాధా ,కెసీత లత ,పాండ్రంగి శారద , జాఫర్ ,సుగుణ మద్దిరెడ్డి, చే బియ్యం శ్రీనివాస్,జక్కా నాగమణి తదితర కవులు పాల్గొన్నారని తెలుగువెలుగు సాహితీ వేదిక అధ్యక్షులు పక్కి రవి శేఖర్ సత్యనారాయణ మూర్తి తెలిపారు
కవులు యొక్క పరిహారం బుక్కు త్వరలో ఆవిష్కరణ చేయడం జరుగుతుందని కార్యవర్గం మూర్తి తెలిపారు

Total Page Visits: 36 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed