SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అంతా మా ఇష్టం..మందు విందు చిందు.టీఆర్ఎస్ నేత

1 min read

అంతా మా ఇష్టం

  • అగ్రికల్చర్ గోదాంలో టీఆర్ఎస్ నేత ఖుషాదావత్
  • మందు విందు చిందు
  • బర్త్ డే, ఖుష్ దావతు హాజరైన ఆఫీసర్లు, పోల్టికల్ లీడర్లు

భైంసా,. మాకు అధికారం ఉంది కదా… అంతా మా ఇష్టం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు,

నాయకులు. ఏకంగా గవర్నమెంట్ అగ్రికల్చర్ గోదాంని ఫంక్షణోల్గా మార్చుకొని మందు, విందు, చిందు చేశారు. ఈ దావత్ మా ఇష్టం అనే ధోరణిలో చేశారు. ఇది నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామంలో చోటు చేసుకుంది. ఆయన ఆ రైతు నాయకులు దీనికి తోడు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి అతి సన్నిహితుడు. ప్రస్తుతం ఈయన భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నాడు. ఇతగాడి పేరు పిప్పెర కృష్ణ. ఆదివారం ఈ సార్ గారి బర్త్ డే ఉండడంతో అటు ఆఫీసర్లకు, ఇటు ప్రజాప్రతినిధులుక ఖుషావత్ ఏర్పాటు చేశారు. కాని ఇతను ఏదో ఫంక్షణీల్లోగాని, కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేశారనుకుంటే పొరపాటే. కాని ఆయన స్వయంగా పదవి కొనసాగిస్తున్న శాఖనే అప్రతిష్ట పాలు చేశాడు. అగ్రికల్చర్ మార్కెట్ గోదాన్నే ఫంక్షణల్గా మార్చుకొని విందు ఇచ్చాడు. భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పెర కృష్ణ ఇచ్చిన దావత్లపై ప్రతిపక్షనేతలు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉందికదా అని చెలాయించుకోవడం వెనుక మర్మం ఏమిటని.. ప్రశ్నిస్తున్నారు. ఈ దావత్కు ఏకంగా జిల్లా స్థాయి ఆఫీసర్లతో పాటు, డివిజన్, మండల స్థాయి అధికారులతో పాటు పలు పార్టీ బడా నేతలు హాజరవ్వడం చర్చనీయంశంగా మారింది. వీరందరు మందు సేవిస్తూ ఎంజాయ్ చేశారు. దినమంత సాగిన ఈ దావత్పై ప్రజలు అధికార పార్టీ నేతలపై మండిపడ్డారు.

Total Page Visits: 27 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed