SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

సమ్మోహన వేణుగోపాల స్వామి వారి దేవాలయ

1 min read

సమ్మోహన వేణుగోపాల స్వామి వారి దేవాలయ-జూనం చుండూరు గ్రా.(గుంటూరు)


చేతిలో పిల్లనగ్రోవి.. అటూ.. ఇటూ శంఖు, చక్రాలు.. కుడిభాగంలో దశావతారాలు.. ఎడమ భాగంలో సప్తరుషులు… విగ్రహం కింది భాగంలో ఇరువైపులా ఉభయ దేవేరులైన రుక్మిణీ, సత్యభామలు.. గోవులు.. ఇదీ గుంటూరుకు సమీపంలోని చౌడవరం పంచాయితీ పరిధిలోగల జూనం చుండూరు గ్రామంలో వెలసిన సమ్మోహన వేణుగోపాల స్వామి వారి దేవాలయ దృశ్యం. నల్లనిరూపుడైన స్వామి విగ్రహం సుమారు ఆరు అడుగులు పొడవు నాలుగు అడుగుల వెడల్పుతో సుందర, సుమనోహరంగా దర్శమిస్తోంది.

-క్రీస్తు పూర్వం అంటే దాదాపు 1500 సం వత్సరాల క్రితం ఈ పురాతన దేవాలయం నిర్మాణమైనట్లు పూర్వీకుల కథనం. దేవాల యంలోని ఈ స్వామిలో ఓ ప్రత్యేకత ఉంది. స్వామి వారి మూలవిరాట్‌ ప్రణవ స్వరూపం లో (ఓంకారం) ఉండి ఆపై వేణుగోపాలునిగా స్వామిని శిల్పి మలిచారు. దేశంలో మరెక్కడా ఇటు వంటి భంగిమ ఉన్నటువంటి విగ్రహం ఉండన్నది పెద్దల కథనం. ఈ ఆదిప్రణవ స్వ రూపంలో చుట్టూ దశావతరాలు, సప్త్తరుషు లు, వేణుగోపాలునికి ఇరుప్రక్కల గోపికల మాదిరి రుక్మిణి, సత్యభామలు గోవులతో కొలువుదీరి ఉంటారు. చూసే వారికి ఈ విగ్రహంలో స్వామివారి పరమార్థం, ఆంతర్యం గోచరించక మానదు. శక్తి మొత్తం ఈ విగ్రహంలోనే వుందనటానికి ఈ ‘‘నిదర్శనాలు’’ కనిపిస్తున్నాయి.

ఇదీ ఆలయ చరిత్ర
బాదామి చాళుక్యులు, తూర్పు చాళుక్యు ల వంశచరిత్రలో స్వామివారిని వీరు దర్శించుకున్నట్లు తగిన ఆధారాలున్నా యి. కొండవీటి రెడ్డి రాజులైన కొమరిగిరి రెడ్డి (కర్పూర వసంత రాయలు) వారి సోద రులు పలుమార్లు స్వామి వారిని దర్శించిన ఆధారాలున్నాయి. వీరి ఆస్థాన నర్తకి ‘‘లకుమాదేవి’’ ఈ స్వామిని ఆరాధ్యదైవంగా కొలించిందట. నాడు గుంటూరు జమిందారులు ఆరోగ్య పరిస్థితులు సరిగాలేని సమయంలో స్వామివారిని దర్శించిన పిమ్మట వారి ఆరోగ్యం కుదుటపడటంతో వీరు స్వామివారి కి కొంత భూమిని దానం చేశారు. ఇప్పటీకీ ఆ భూమి దేవాలయం వారి ఆధీనంలో సాగుబడి జరుగుతోంది. ఈ చరిత్ర మిగిల్చిన సాక్షాలను ఇంకా మద్రాసు వాత్రప్రతుల గ్రంథాలయంలో అక్షర రూపం దాల్చి నిక్షిప్తంగా మిగిలి ఉన్నాయి.

ఈ దేవాలయాన్ని ఎప్పుడు ఏరాజులు నిర్మించారో ఇతమిద్ధంగా తెలియనప్పటికీ క్రీస్తుపూర్వం నాటి ఆధారాలవల్ల ఈ దేవాల యాన్ని ఆనాడే నిర్మించే ఉంటారని గ్రంథా లయ ద్వారా స్పష్టమౌతోంది. కొన్ని వేల సంవత్సరాలు గడిచినా నేటికీ స్వామివారి విగ్రహంలో ‘‘తేజస్సు’’ చెక్కు చెదరక పోవ డం విశేషంగా చెప్పుకోవచ్చు. అదే ఈ ప్రాంతవాసులను కాపాడుతుందన్నది వారి కి నిగూఢమైన విశ్వాసం. ఇప్పటికీ ఈ దేవాలయం నాలుగుసార్లు పునఃనిర్మాణం జరిగినట్లు పెద్దలు చెబుతున్నారు. వార్షికం గా స్వామివారి ‘‘తిరు కళ్యాణం’’ ఫాల్గుణ పౌర్ణమికి జరుగుతుంటాయి. వార్షిక పం డుగ ఉత్సవాలు నిర్విరామంగా నిర్వహిస్తు న్నారు. ప్రధానంగా స్వామి వారి గ్రామోత్స వాలలో గ్రామ యువకులు ప్రముఖ పాత్ర వహిస్తారు.

నాటి బ్రాహ్మణ అగ్రహారమే..
పూర్వం ఇది బ్రాహ్మణ అగ్రహారం. ‘‘నేతి’’ వారి దంపతులకు జన్మించిన పుత్రికల పేరున ఈ గ్రామ నిర్మాణం జరిగింది. జ్వాలాముఖి, చండికా అనేవీరి పేర్లు మీదుగా నిర్మాణమై జ్వాలా చండికాపురం జూనం చుండూరుగా రూపాంతరం చెందింది. ఇది గుంటూరు పట్టణానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ని ఓ చిన్న కుగ్రామం. ఈ జూనం చూండురు అగ్రహారం కాస్తా నేడు కుచించుకు పోయి చివరకు ఒకే కుటుంబం స్వామివారి అర్చక నిమిత్తం వుండిపోయింది. వారు మాత్రమే స్వామి వారికి సేవలు చేసుకుంటూ స్వామిని ప్రగాఢంగా నమ్ముకొని నివాసం ఏర్పాటు చేసుకొని జీవితం వెళ్లదీస్తున్నారు.

స్వామి వారిపై ప్రముఖుల ఆశుపద్యాలు
కొండవీటి రెడ్డి రాజుల ఆస్థాన విద్యాధికారి, కవి సార్వభౌముడు ‘శ్రీ నాధ కవి’ స్వామి వారిని చూసి సమ్మోహనుడై ‘గోపాలశతకం’ రచించినట్లు నానుడి. ఈ 20వ శతాబ్దంలోని ప్రముఖ కవులెందరో ఈ స్వామి వారిని కనులారా వీక్షించి, జన్మ ధన్యతను పొందారు. వీరిలో ముఖ్యులు కీ.శే. కరుణశ్రీ జంధ్యా పాపయ్య శాస్ర్తి, కుర్తాళం పిఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి (ప్రసాదరాయకులపతి) డాక్టర్‌ మైలవరపు శ్రీనివాసరావు, కోగంటి సీతారామచా ర్యులు, కీ.శే. పరాశరం గోపాల కృష్ణమాచార్యులు, ప్రముఖ నవలా రచయిత లల్లాదేవి, జంధ్యాల జయకృష్ణ బాపూజీ వంటి మహనీయులు ప్రణవస్వరూపుని దర్శించి వీక్షించి ఆశుపద్యాలను వినిపించారు.

శ్రీ అయ్యప్ప పూజ విధానం

Total Page Visits: 238 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed