SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అమృతేశ్వర దేవాలయం -చిక్కమంగళూరు

1 min read

11-12 శతాబ్ధాల మధ్య కర్ణాటక ని పరిపాలించిన హొయసల రాజులు మలనాడుకి దగ్గరలో అనేక నగరాలు, పట్టణాలు నిర్మించారు. ఈ పట్టణాలలో అత్యంత అద్భుతమైన అలంకారమైన దేవాలయాలు నిర్మించారు. ఈ పట్టణాలు, దేవాలయాలు ఒకదానికి మరోకటి అతి దగ్గరలో ఉండడం విశేషం.

అమృతేశ్వర_దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమంగళూరు పట్టణానికి దగ్గర్లో ఉన్న అమృత్‌పుర గ్రామంలో ఉంది. హస్సన్ నుంచి 110 కిలోమీటర్లు, శివమొగ్గ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో 206వ జాతీయ రహదారిలో ఉంది. ఈ గ్రామంలో ఉన్న అమృతేశ్వరాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయాన్ని క్రీ.శ. 1196వ సంవత్సరంలో నిర్మించారు. హొయసల రాజు వీర బళ్ళాల II కాలంలో ఆయన సైన్యాధ్యక్షుడైన అమృతేశ్వర దండనాయకుడు నిర్మించారు.

హొయసల రాజుల కాలంలో శిల్ప కళాచాతుర్యానికి ఈ దేవాలయ బయటి మండపం ఒక ప్రతీక. ఈ ఆలయ బయటి మండపం తాటి, కొబ్బరి తోటల మధ్య ఉంది. వెలుపలి మండపం బయటి గోడలపై అత్య అద్భుతంగా గుండ్రటి ఆకారంలో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ దేవాలయంకి ఒకే విమానం ఉండడం వల్ల ఏకకుట అని పిలుస్తారు. వెలుపలి మండపం నుండి లోపలికి వెళ్ళితే లోపలి మండపం వస్తుంది. ఈ గుడి నిర్మాణ శైలి, మండపాలు బెల్‌వాడి నందున్న వీరనారాయణ దేవాలయ శైలిని పోలి ఉంటుంది. వెలుపలి మండపంలో 29 దీర్ఘచతురస్ర విభాగాలు, లోపలి మండపంలో 6 దీర్ఘచతురస్ర విభాగాలు ఉన్నాయి. లోపలి గర్భ గుడి చతురస్రాకారంలో ఉండి, గర్భ గుడి శిఖరంపై భాగంలో కీర్తిముఖులు చెక్కబడి ఉన్నారు. ఈ కీర్తి ముఖుల క్రింది భాగం దేవతా శిల్పాలు లేవు. సుఖాశిని పై హొయసలరాజుల రాజ చిహ్నమైన శాల పులితో యుద్ధం చేస్తు సంహరిస్తున్న శిల్పం ఉంది.
వెలుపలి మండపం బయటి గోడలపై 140 పలకల మీద భారత ఇతిహాసాలు చెక్కబడ్డాయి. మిగతా హొయసల దేవాలయల వలే ఇక్కడి దేవాలయం పై చెక్కబడిన శిల్పాలు చిన్నవిగా కాకుండా పెద్దవిగా చెక్కబడ్డాయి. వెలుపలి మండపం దక్షిణం వైపు గోడపై రామాయణ కథ 70 పలకలపై అపసవ్య దిశలో చెక్కబడింది. ఉత్తర గోడపై 25 పలకలపై శ్రీకృష్ణ జీవిత చరిత్ర, మిగిలిన 45 పలకలపై మహాభారతం చెక్కబడింది.

ప్రసిధ్ధ హొయసల శిల్పి రువరి మల్లిటమ్మ, ఈ ఆలయంలోని గోపురంలోని పైకప్పు మీద, లోపలి మండపంలోను శిల్పాలు చెక్కాడు.ఈ దేవాలయ ముంగిటిలో ఉన్న పెద్ద శిలలపై అప్పటికి కన్నడ కవి జక్కన్నచే కూర్చబడిన సాహిత్యం, కవితలు చెక్కబడి ఉన్నాయి.

Total Page Visits: 253 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed