SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

శాఖాంబరి అలంకరణ లో శ్రీ కోట సత్తెమ్మ అమ్మ వారు

1 min read

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాడ మాస అమావాస్యను పురస్కరించుకుని శాఖాంబరి అలంకరణ లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో బల్ల నీలకంఠం మాట్లాడుతూ శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి కి ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో వచ్చే అమావాస్య నాడు శాకాంబరీ దేవి గా అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు అలంకరణ కు నిడదవోలు కూరగాయల వర్తక సంఘం వారు సుమారు 30 రకాల కూరగాయలు 1500 కిలోలు అందించారని ,అలాగే తిమ్మరాజు పాలెం గ్రామానికి చెందిన డాక్టర్ ప్రసాద్ 14 రకాల పండ్లు అందించారని తెలిపారు.
ఆలయ చైర్మన్ శ్రీ దేవులపల్లి రామ సుబ్బరాయశాస్త్రి మరియు పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో దిగ్విజయంగా నిర్వహించారు. అమ్మవారి ప్రీతిపాత్రమైన ఆదివారం రోజున ఈ

అలంకరణ చేయడం తో అశేషంగా గా భక్తులు విచ్చేసి శాకంబరీ అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు

Also read

Total Page Visits: 258 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed