SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నేటి నుంచి దుర్గ‌మ్మకు ఆషాఢ సారె సమర్పణ

1 min read



ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు ఆషాఢ మాస తొలి సారెను దేవస్థానం తరపున వైదిక కమిటీ, దేవస్థానం ఉద్యోగులు ఆదివారం సమర్పిస్తారని దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు శ‌నివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు స్థానాచార్య శివప్రసాదశర్మ ఆధ్వర్యంలో అర్చక సిబ్బంది. అమ్మవారికి తొలి సారెను సమర్పిస్తారని తెలిపారు. ఈ నెల 11 నుంచి ఆగస్టు 8 వరకు ఆషాఢ సారెను సమర్పించే భక్తులు, ధార్మిక సంస్థలు మూడు రోజులు మందుగా దేవస్థానం అధికారులకు తెలియజేయాలని కోరారు. ఆఫీసు వేళల్లో దేవస్థానం ఫోను నెంబర్లు 9493545253, 8341547300ల‌కు ఫోను చేసి ఎక్కడి నుంచి సారెను తీసుకువస్తున్నది. భక్తుల సంఖ్య , ఏ తేదిన సమర్పించేది త‌దిత‌ర వివరాలను ముందుగా నముదు చేసుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించి దేవస్థానం అధికారులకు సహకరించాలని కోరారు.

Total Page Visits: 116 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed