SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కవిత్వంలో సామాజిక దృక్పథం మిళితమై ఉండాలి : చిత్తలుారి సత్యనారాయణ

1 min read

*కవిత్వంలో సామాజిక దృక్పథం మిళితమై ఉండాలి : చిత్తలుారి సత్యనారాయణ*

**వచన కవిత్వం రాయడం ఎలా ఆనే ఆంశంపై కవి సమ్మేళనానికి విశేష స్పందన*
హైదరాబాదు

కవిత్వం సామాజిక దృక్పథం మిళితమై ఉండాలని, సందేశం రసాత్మకంగా ఉండాలని
ప్రముఖ ఆంగ్ల అధ్యాపకులు ,
కథకులు విమర్శకులు అనువాదకులు అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డు
గ్రహీత చిత్తలూరి సత్యనారాయణ తెలిపారు.
తెలుగు వెలుగు సాహిత్యవేదిక, ఎస్ వి ఫౌండేషన్, జనదీపిక సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాల జాతీయ కవి సమ్మేళనంలో వచన కవిత్వం రాయడం ఎలా అనే అంశంపై కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ప్రముఖ ఆంగ్ల ఉపాధ్యాయుడు
కథకులు, విమర్శకులు అనువాదకులు అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డుల గ్రహీత చిత్తలూరి సత్యనారాయణ మాట్లాడుతూ కవిత్వం సామాజిక దృక్పథంతో కలిగి ఉండాలని అన్నారు . కవిత్వం బలంగా ఉండాలని సామాజిక లోపాలను ఎత్తి చూపుతూ..భావ వ్యక్తీకరణ ఉండాలన్నారు.ప్రతి కవి పక్క వారి కవితలను కూడా చదవాలని సూచించారు . శరీరానికి చొక్కా కుట్టేవాడు దర్జీలాగా కవి ఉండాలన్నారు. చొక్కా కుట్టేటప్పుడు ఎన్నో ముక్కలు ముక్కలు చేసి ఎన్నో అతుకులు వేసి చివరికి ఒక రూపంలో తీసుకుని వస్తాడు అదే విధంగా కవి కూడా ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో గ్రంథాలు చేరి చివరికి ఒక కవిత్వ దశకు చేరుకుంటాడని తెలిపారు ప్రతీ కవీ కూడా అవతల వారు రాసిన కవిత్వం ఇష్టం ఉండకపోవచ్చు ఇష్టం లేకపోవడం అందుకు ఒక ఉదాహరణ బంకమట్టి తీసుకుని పది రకాల వస్తువులను తయారు చేస్తాడు అందులో పల్లెం కావచ్చు గ్లాస్ కావొచ్చు మరి ఏ ఇతర వస్తువులను తయారు చేయవచ్చు ఇందులో మనకు నచ్చింది ఒకటి కావచ్చు రెండు కావచ్చు మనం తీసుకునేది ఒకటే కానీ అన్నిట్లో బాగా ఉండేది నచ్చేది ఒకటే వుంటాయన్నారు అలాగే మనం ఎన్నో కవితలు రాస్తే అందరికీ నచ్చాలని లేదు ఏదో ఒకటి నచ్చుతాయని తెలిపారు మనకు కవిత్వం రావాలంటే సాహిత్యం మౌలిక భావనలూ పుస్తకాలను పఠనం చేయాలని అన్నారు అలాగే మరొక ఉపన్యాసకులు ప్రముఖ కవి రచయిత విశ్లేషకులు విమర్శకులు
గంటా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కవిత అనేది కొలబద్ద కాకూడదని అన్నారు.
కవి అనేవాడు కన్నుమూసేవరకు నిద్రపోనీయడన్నారు. కవి ఒక సృష్టికర్త ,అనుసంధానకర్త, జ్ఞాన కర్త, చరిత్ర కర్తని
అన్నారు కన్నుల కాటుక అందం కవితకు కల్పన అందం అన్నారు
ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి రచయిత విశ్లేషకులు విమర్శకులు శ్రీ కిలపర్తి గాలి నాయుడుగారు కవులందరి కవితలను విని విశ్లేషణ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాండ్రింకి శారద అతిధులను ఆహ్వనించగా చొప్నదండి రాధా ప్రార్థన గీతంతో సభనుప్రారంభించారు.
సమన్వయ కర్తలుగా నవనీత రవీందర్ మల్లేశ్వరి సుగుణ మద్దిరెడ్డి లు వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా నారాయణరావు కొనసాగించారు ముగింపు పలుకులు చెబియం శ్రీనివాసరావు హారతి పాత పాంటింగ్ కార్గెతో ముగించారని తెలుగువెలుగు జాతీయ అధ్యక్షులు పిఆర్ ఎస్ మూర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో మూర్తి మాట్లాడుతూ పుారౄముపద్యం వర్తమానం వచ్చిన కవిత అన్నారు
తెలుగు కవులలో ఆకట్టుకునేది వచ్చిన కవిత్వం తెలుగు కవిత్వానికి రజినీ దిక్కు అనేది అంగీకరించక తప్పదు తెలుగు కవులు ప్రక్రియకు శ్రీకారం చుట్టాలన్న కథనంతో యువకులు చేసిన ప్రయోగమే వచ్చిన కవిత అని అన్నారు
ఈ కార్యక్రమంలో కవులు ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా పాండిచ్చేరి యానాం పాండిచెరీ కర్నాటక మధ్యప్రదేశ్ తమిళనాడు ముంబయి దుబాయ్ నుండి అత్యధిక కవులు పాల్గొని విజయవంతం చేశారని వారందరికీ కూడా అభినందనలు తెలిపారు ఆ సంస్థ అధ్యక్షులు కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు

ఇడి అధికారి, కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి ఫోన్‌నెంబర్లు ..

Total Page Visits: 105 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed