SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమం

1 min read

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:
ఆషాడ మాసం సంధర్భంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమం ఈరోజు అనగా ది.11-07-2021 న అత్యంత వైభవముగా ప్రారంభించబడినది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం శ్రీయుత ఆలయ స్థానాచార్యుల వారు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారి ఆధ్వర్యంలో ఆలయ వైదిక మరియు అర్చక సిబ్బంది వారు కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారికి మొదటి సారె సమర్పించుటకు కనకదుర్గానగర్ మహామండపం నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ విచ్చేయగా, గౌరవనీయులైన ఆలయ చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు దంపతుల వారు మరియు పాలకమండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ వైదిక మరియు అర్చక సిబ్బంది తరపున స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ దంపతుల వారు శ్రీ అమ్మవారికి ప్రధమ సారెను సమర్పించడముతో, శ్రీ అమ్మవారి ఆషాడ పవిత్ర సారె కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభించడం జరిగినది. అనంతరం మహామండపం 6వ అంతస్తు నందు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద పూజలు నిర్వహించి, సుమారు రూ.3.30 లక్షల విలువజేయు బంగారు మయూరి హారమును శ్రీ అమ్మవారికి కానుకగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు శ్రీ కనుగుల వెంకటరమణ గారు, శ్రీమతి ఎన్. సుజాత గారు, శ్రీమతి కటకం శ్రీదేవి గారు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Total Page Visits: 74 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed