SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పార్లమెంట్ లో టీడీపీ వ్యూహం.. ఎంపీల రాజీనామా?

1 min read

రాబోయే పార్లమెంట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఉభయ సభల్లో ఎలా వ్యవహరించాలి.. ఏయే అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించాలో వివరించినట్లు తెలుస్తోంది. మొత్తం 18 అంశాలపై వీరి మధ్య చర్చ జరగగా ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా, జల వివాదాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని, అధికార వైసీపీ ఎంపీలు ఇదే అంశాలపై పోరాటం చేస్తే కలిసి వెళ్లాలని.. లేదా ఒంటరిగా అయినా పోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తామని అన్నారు. అవసరం అయితే ఎంపీ పదవులకు సైతం రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఇదే అంశం అజెండాగా టీడీపీ నేతలు అంతా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని.. మరి వైసీపీ ఎంపీలు అందుకు సిద్ధంగా ఉండగలరా అని సవాల్ విసిరారు.

Total Page Visits: 92 - Today Page Visits: 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed