SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

చమురు, గ్యాస్‌ క్షేత్రాల ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఆఫీసర్స్ యూనియన్‌..

1 min read

న్యూఢిల్లీ : ఒఎన్‌జిసికి చెందిన అతిపెద్ద గ్యాస్‌, చమురు క్షేత్రాలను విదేశీ కంపెనీలకు అప్పజెప్పాలన్న పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను కంపెనీ అధికారుల సంఘం వ్యతిరేకిస్తోంది. కంపెనీ తన ప్రధాన ఆస్తులను ప్రైవేట్‌ పరం చేయడానికి బదులుగా కంపెనీకి సాధికారత, స్థాయిని కల్పించాలని సూచించింది. ఒఎన్‌జిసి సైంటిఫిక్‌ అండ్‌ టెక్నికల్‌ కార్యాలయాల సంఘం పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి చేసిన ప్రతిపాదనను సవాలు చేస్తూ పిటిషన్‌ వేసింది. ఉత్పత్తిని పెంచేందుకంటూ ముంబయి హై అండ్‌ బెసిన్‌ శాటిలైట్‌ (బిఅండ్‌ ఎస్‌)కి చెందిన 60 శాతం వాటాలతో పాటు ఆస్తుల నిర్వహణను అంతర్జాతీయ భాగస్వాములకు అప్పగిస్తున్నట్లు పెట్రోలియం అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అమర్‌నాథ్‌ ఒక ప్రతిపాదనను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దిగుమతలను తగ్గించడానికి దేశీయ ఉత్పత్తిని పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యంతో కంపెనీ, తాము కట్టుబడి ఉన్నామని ఒఎన్‌జిసికి చెందిన 17వేల మంది ఆఫీసర్లతో కూడిన యూనియన్‌ పేర్కొంది. దీనికోసం ప్రైవేట్‌ రంగానికి అందిస్తామన్న ఆర్థిక, నియంత్రణలతో కూడిన నిర్వహణను కంపెనీకి అందించాలని యూనియన్‌ పేర్కొంది. ఒఎన్‌జిసి క్షేత్రాల కోసం ప్రభుత్వ నిర్దేశించిన మార్కెట్‌ ధర కన్నా తక్కువగా గ్యాస్‌ ధరను స్థిరీకరించాలని, చిన్న, మారుమూల క్షేత్రాల నుండి కూడా ఉత్పత్తిని క్రమబద్ధీకరించేందుకు సమీక్ష చేపట్టాలని ఈ నెల 11న పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌కి లేఖ రాసింది. సహజ గ్యాస్‌ చిన్న క్షేత్రాలను విక్రయించడానికి, ధరల విధానంలోనూ ఒఎన్‌జిసికి పూర్తి స్వేచ్ఛనివ్వాలని కోరింది. ప్రైవేట్‌, విదేశీ వ్యక్తులు నూతన చమురు క్షేత్రాలను సర్వే చేపట్టడానికి, బావులను తవ్వేందుకు మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడరని, ఇప్పటికే ఉన్న చమురు క్షేత్రాలను ఆక్రమించుకునేందుకు యత్నిస్తారని యూనియన్‌ పేర్కొంది. ప్రైవేట్‌ ఆపరేటర్లు వాణిజ్యపరమైన అంశాలకు, ప్రస్తుతం ఉన్న వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తారు దీంతో ఎన్‌జిసిని తీసుకుని రిస్క్‌ తీసుకునేందుకు ఇష్టపడకపోవచ్చని ఆ లేఖలో తెలిపింది.వాణిజ్య పరంగా ఆదాయం తగ్గగానే ఇ అండ్‌ పి కంపెనీలు ఈ క్షేత్రాలను వదులుకున్నాయని పేర్కొంది. ఉదాహరణకు పన్నా, ముక్తా, తప్తీ ఫీల్డ్‌లను అంతర్జాతీయ ఇఅండ్‌పి ఆపరేటర్లు తమ లీజులను పునరుద్ధరించుకోలేదు. అయితే ఈ ఫీల్డ్‌ల నుండి వెలికితీసిన చమురు మొత్తం నిష్పత్తి 20 శాతానికి చేరుకోగా, ఒక్కో సందర్భంలో పది శాతానికన్నా తక్కువకు పడిపోయాయని అన్నారు. అయితే ముంబయి హై అండ్‌ బేసిన్‌ ఫీల్డ్‌లో చమురు మొత్తం నిష్పత్తి 28 శాతంగా ఉందని పేర్కొంది. బిజి గ్రూప్‌ వెనక్కితగ్గిన వెంటనే ఒఎన్‌జిసి పన్నా, ముక్తా, తపతి ఫీల్ట్‌లను స్వాధీనం చేసుకుందని, ప్రస్తుతం ఆమోదించబడిన దాని కంటే అధికంగా ఉత్పత్తి చేస్తుందని ఆ లేఖలో వెల్లడించారు. తమ సూచనలు తెలిపేందుకు హర్దీప్‌ సింగ్‌తో సమావేశమయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరింది.

Also read

Total Page Visits: 106 - Today Page Visits: 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed