SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మోడెర్నా వ్యాక్సిన్‌..త్వరలో భారత్‌కు రానున్న 75 లక్షల డోసులు

1 min read

న్యూఢిల్లీ : త్వరలో మోడెర్నా వ్యాక్సిన్‌ భారత్‌లో పంపిణీ కానుంది. ప్రపంచంలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ అనంతరం అత్యధికంగా వినియోగిస్తున్న వ్యాక్సిన్‌ మోడెర్నానే. అయితే ఈ వ్యాక్సిన్‌ ఇంకా భారత్‌లో విడుదల కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీలో అసమానతలు తలెత్తకుండా ఉండేలా చూసేందుకు డబ్ల్యుహెచ్‌ఒ రూపొందించిన కోవ్యాక్స్‌ ప్రోగ్రాం కింద.. భారత్‌కు 75 లక్షల మోడెర్నా వ్యాక్సిన్‌ డోసులను అందజేయనున్నట్లు డబ్ల్యుహెచ్‌ఒ ఆగేయాసియా రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ తెలిపారు. అయితే ఈ వ్యాక్సిన్‌ డోసులు భారత్‌కు ఎప్పటికి చేరుకుంటాయనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఈ వ్యాక్సిన్‌ లభ్యత ‘ఇండెమ్నిటీ క్లాజు’తో ముడిపడి ఉందని ఖేత్రపాల్‌ తెలిపారు. కాగా, గత నెల భారత్‌లో మోడెర్నా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి కానీ పూర్తిస్థాయిలో కాదని అన్నారు. భారత్‌లోని ప్రముఖ ఔషధ సంస్థ సిప్లా ఈ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుంటుందని, వీటిపై కేంద్ర ప్రభుత్వం పరిశీలన ఉంటుందని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ప్రస్తుతం భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో దేశీయ ఉత్పత్తులైన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌లతో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్‌లను వినియోగిస్తున్నారు. మోడెర్నా వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌పై 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తోంది.

Also read

Total Page Visits: 25 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed