SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అన్నీ చర్చించాకే బోర్డుల పరిధి.. విభజన చట్టం ప్రకారమే గెజిట్‌

1 min read

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో అన్ని విషయాలు చర్చించాకే కఅష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జిఆర్‌ఎంబి) పరిధిని నిర్ణయించామని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సంజరు అవస్థీ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర జల సంఘం (సిడబ్ల్యూసి) చైర్మన్‌ ఎస్‌.కె.హల్దర్‌, సభ్యుడు కుష్విందర్‌ వోహ్రాతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబి పరిధి నిర్ణయిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గురువారం రాత్రి విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 87 ప్రకారమే కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబిల పరిధిని నిర్ణయిస్తూ గెజిట్‌ విడుదల చేశామన్నారు. 2020 అక్టోబరులో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం దీనిని నోటిఫై చేయాలని నిర్ణయించింది. సిడబ్ల్యూసి అధికారులు రాత్రి పగలూ పనిచేసి ఒక్కో పదాన్ని జాగ్రత్తగా ఎంచుకుని నోటిఫికేషన్‌ రూపొందించారని అన్నారు.

కష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల పాలన, నియంత్రణ, నిర్వహణ విషయాలను షెడ్యూలులో చేర్చామని, ఆయా బోర్డులు రెండు రాష్ట్రాల మధ్య నీరు, విద్యుత్తు సరఫరాపై నియంత్రణ కలిగి ఉంటాయని అన్నారు. ఆమోదం పొందినవి, ఆమోదం పొందని ప్రాజెక్టులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నామని, ఆమోదం పొందని ప్రాజెక్టులేవో ఈ ఉత్తర్వుల్లో నిర్వచించామని తెలిపారు. నిర్వహణ ఖర్చులను రెండు రాష్ట్రాలు చెరి సగం భరించాలని, నోటిఫికేషన్‌ జారీ అయిన 60 రోజుల్లోగా రెండు రాష్ట్రాలు రూ. 200 కోట్ల చొప్పున డిపాజిట్‌ చేయాలని వివరించారు. పార్ట్‌-డిలో ఆమోదం పొందని ప్రాజెక్టులను నిర్వచించామని, షెడ్యూలులో ప్రస్తావించినంత మాత్రాన ప్రాజెక్టులు ఆమోదం పొందినట్టు కాదని అన్నారు. ప్రాజెక్టులను మూడు షెడ్యూళ్లుగా విభజించామని, మొదటి షెడ్యూల్‌లో ప్రాజెక్టులన్ని పొందుపరిచామని పేర్కొన్నారు. షెడ్యూలు-2, షెడ్యూలు-3 విభిన్నంగా ఉంటాయని అన్నారు. షెడ్యూలు-2 ప్రాజెక్టులు పూర్తిగా 100 శాతం ఆయా బోర్డుల నియంత్రణలో ఉంటాయని, సిఐఎస్‌ఎఫ్‌ రక్షణ వీటికి అందుబాటులో ఉంటుందని తెలిపారు. షెడ్యూలు-3లో పొందుపరిచిన ప్రాజెక్టులకు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న రీతిలో యథాతథంగా నిర్వహించుకోవచ్చని, అయితే ఆయా బోర్డుల నుంచి మార్గదర్శనం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై కూడా విస్తఅతంగా చర్చించి షెడ్యూలు-2, షెడ్యూలు-3 ప్రాజెక్టులను వర్గీకరించామని, సుహఅద్భావంతో నడవని పక్షంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తే ప్రాజెక్టులను షెడ్యూలు-2లో చేర్చామని వివరించారు.



నీటి పంపిణీపై కేంద్రానిది అంపైర్‌ పాత్ర
నీటి పంపిణీ అనే అంశం అతి సున్నితమైందని, కేంద్ర ప్రభుత్వానిది ఇక్కడ అంపైర్‌ పాత్రేనని సంజరు అవస్థీ అన్నారు.కఅష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) కార్యాలయాన్ని ఏపికి తరలించడం వంటి చిన్న అంశంపౖౖె కూడా ఏకాభిప్రాయం సాధించడానికి చాలా కష్టపడాల్సివచ్చిందన్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ మొదటి సమావేశం తరువాత రెండో సమావేశం జరపడానికి నాలుగేళ్ల పట్టిందని,ముందుకు ఎలా వెళ్లాలన్న అంశంపై ఇప్పుడు ఒక స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. ఏడేళ్లు అనేది చాలా సుదీర్ఘ వ్యవధే అయినప్పటికీ, అన్ని పక్షాలను ఒక వేదికపైకి తీసుకువచ్చి 8 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం పరస్పరం చర్చించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.

కఅష్ణా నదీ జలాల పంపకం పరిగణనలో ఉంది
తెలంగాణ కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి, కఅష్ణా నదీ జలాలను తిరిగి నాలుగు రాష్ట్రాల మధ్య పంచాలనే తెలంగాణ ప్రభుత్వ డిమాండ్‌పై సిడబ్ల్యుసి చైర్మన్‌ ఎస్‌.కె.హల్దర్‌ స్పందిస్తూ దీనిపై అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనే విస్తఅతంగా చర్చించామని అన్నారు. సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు జూన్‌ రెండో వారంలో వెనక్కి తీసుకోవడంతో దీనిని న్యాయ శాఖకు నివేదించామని చెప్పారు. న్యాయశాఖ అనేక అంశాలపై సమాచారం కోరిందని, తాము న్యాయశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. వారు ఎలాంటి అభిప్రాయం చెబుతారో తెలియదు కానీ, దీనిపై జలశక్తి శాఖ మంత్రి ఇప్పటికే అండర్‌టేకింగ్‌ ఇచ్చినందున, దానికి కట్టుబడి ఉంటామని సంజరు అవస్థీ తెలిపారు. అలాగే గోదావరి ట్రిబ్యునల్‌ ఏర్పాటు అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నామని అన్నారు.

Also read

Total Page Visits: 263 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed