SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు

1 min read

Cabinet Expansion 2021: ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్‌ను విస్తరించారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొత్త మంత్రులతో
ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్‌ను విస్తరించారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో15మంది కేబినెట్‌ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులు ఉన్నారు. ఇందులో తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డికి కేబినెట్‌ హోదా లభించింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కలిసి పనిచేయడం ద్వారా బలమైన, సంపన్న భారత నిర్మాణానికి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. తాజాగా మంత్రుల కేటాయింపు ఇలా జరిగింది.


ప్రధాని నరేంద్ర మోదీ – ప్రధానమంత్రి, శాస్త్ర సాంకేతిక, సిబ్బంది వ్యవహరాలు, పబ్లిక్‌ గ్రీవెన్స్‌, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్షశాఖ, వివిధ పథకాలు, ఇతరులకు కేటాయించని మంత్రిత్వ శాఖలను పర్యవేక్షించనున్నారు.

కేబినెట్‌ మంత్రులు- వారి శాఖలు

1. రాజ్‌నాథ్‌ సింగ్‌ – రక్షణ శాఖ

2. అమిత్‌ షా- హోంమంత్రిత్వ శాఖ, సహకార శాఖ

3. నితిన్‌ గడ్కరీ- రహదారులు, రవాణా శాఖ

4. నిర్మలా సీతారామన్‌- ఆర్థిక శాఖ, కార్పొరేట్‌ వ్యవహరాలు

5. నరేంద్ర సింగ్‌ తోమర్‌- వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ

6. సుబ్రహ్మణ్యం జయశంకర్‌- విదేశీ వ్యవహారాలు

7. అర్జున్‌ ముండా- గిరిజన వ్యవహారాలు

8. స్మృతి ఇరానీ- మహిళా, శిశుసంక్షేమశాఖ

9. పీయూష్‌ గోయల్‌ – వాణిజ్యం, పరిశ్రమలు, అదనంగా జౌళిశాఖ, ఆహార, ప్రజా పంపిణీ

10. ధర్మేంద్ర ప్రధాన్‌ – విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ

11. ప్రహ్లాద్‌ జోషీ – పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ

12. నారాయణ్‌ రాణే – చిన్న, మధ్యతరహా పరిశ్రమలు

13. శర్వానంద సోనోవాల్‌- ఓడరేవులు, జలరవాణా, ఆయుష్‌ శాఖ

14. ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ- మైనారిటీ వ్యవహారాలు

15. డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌ – సామాజిక న్యాయం, సాధికారత

16. గిరిరాజ్ సింగ్‌ – గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌

17. జ్యోతిరాదిత్య సింధియా- పౌర విమానయాన శాఖ

18. రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌ – ఉక్కు శాఖ

19. అశ్వినీ వైష్ణవ్‌ – రైల్వే, ఐటీ కమ్యూనికేషన్లు

20. పశుపతి కుమార్‌ పారస్‌ – ఫుడ్‌ ప్రాసెసింగ్‌

21. గజేంద్రసింగ్ షెకావత్‌ – జల్‌శక్తి

22. కిరణ్‌ రిజిజు – న్యాయశాఖ

23. రాజ్‌కుమార్‌ సింగ్‌ – విద్యుత్‌, పునరుత్పాదక ఇంధన శాఖ

24. హర్‌దీప్‌ సింగ్‌ పూరీ – పట్టణ అభివృద్ధి, పెట్రోలియం శాఖ

25. మన్‌సుఖ్‌ మాండవీయ – ఆరోగ్యశాఖ, రసాయనాలు, ఎరువులు

26. భూపేంద్ర యాదవ్‌ – పర్యావరణ, అటవీ, ఉపాధి, కార్మిక శాఖ

27. మహేంద్రనాథ్‌ పాండే – భారీ పరిశ్రమల శాఖ

28. పురుషోత్తం రూపాల – డెయిరీ, మత్స్య శాఖ, పశుసంవర్థక శాఖ

29. కిషన్‌రెడ్డి – పర్యాటక, సాంస్కృతిక శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి

30. అనురాగ్‌ఠాకూర్‌ – సమాచార-ప్రసారాలు, యువజన వ్యవహారాలు, క్రీడలు

స్వతంత్ర హోదా- శాఖలు

1. రావు ఇందర్‌జిత్‌ సింగ్‌- గణాంకాలు, ప్రణాళిక, కార్పొరేట్‌ వ్యవహరాలు

2. డా. జితేంద్ర సింగ్‌- సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎర్త్ సైన్స్‌, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ

  • http://www.sgstvtelugu.com/జాతీయం/వైజాగ్-స్టీల్-ప్లాంట్-ప్/
Total Page Visits: 179 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed