SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

సుమన్‌కు దాదా సాహేబ్‌ ఫాల్కే పురస్కారం

1 min read

*నటుడు సుమన్‌ను దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం* వరించింది. ముంబయిలో ఆదివారం జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో దక్షిణాది నుంచి సుమన్‌ ఈ పురస్కారం అందుకున్నారు. దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్ అవార్డు ప్రదానం చేశారు. పురస్కారం అందుకోవడం పట్ల సుమన్ ఆనందం వ్యక్తం చేశారు. నటుడిగా తన ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా సుమన్‌ కృతజ్ఞతలు చెప్పారు. *ఇటీవల సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను దాదాసాహెబ్‌ అవార్డు వరించిన విషయం తెలిసిందే.* 

*కర్ణాటకకు చెందిన సుమన్‌ యాక్షన్‌ హీరోగా* సినిమా తెరకు పరిచమయ్యారు. *అన్నమయ్యలో ‘వేంకటేశ్వరస్వామి’* పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ తర్వాత *‘శ్రీరామదాసు’లో రాముడిగా* కనిపించిన ఆయన భక్తిరస పాత్రలు పోషించడంలో తన సత్తా ఏంటో నిరూపించారు. రజనీకాంత్‌ కథానాయకుడిగా వచ్చిన ‘శివాజీ’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించి విలన్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. *తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు*. ప్రస్తుతం కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తూ వస్తున్నారు.”
 

Read also

Total Page Visits: 65 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed