SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

భద్రక్‌-విజయనగరం రైల్వే లైన్‌ లేనట్లే

1 min read

భద్రక్‌-విజయనగరం మధ్య 2015-16 రైల్వే బడ్జెట్‌లో ప్రతిపాదించిన మూడో రైల్‌ లైన్‌ నిర్మాణానికి ఇంకా ఆమోదం పొందలేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ రాజ్యసభకు తెలిపారు. వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కోల్డ్‌ స్టోరేజ్‌ల ఏర్పాటుతో పాటు ఉద్యానవన అభివృద్ధి కోసం మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ (మిడ్‌) కింద గత మూడేళ్లలో రూ. 277.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. అటవీ నిర్మూలన పరిహార నిధి చట్టం 2016 అమలులోకి వచ్చిన తరువాత గత రెండేళ్లలో నేషనల్‌ అథారిటీ నుంచి 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2019 ఆగస్టు నుంచి 2021 జనవరి మధ్య రూ.48,477.77 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1,734.81 కోట్లు, తెలంగాణకు రూ.3,110.38 కోట్లు విడుదల చేశామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
దేశంలో కరోనాను నియంత్రణలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు ఇప్పటికీ మూసివేసి ఉన్నాయని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఈ ఏడాది మార్చి 31నాటికి అంగన్వాడీ సేవలు అందుకుంటున్న 8,31,80,208 మంది లబ్ధిదారులకు అనుబంధ పోషకాహారం అందించామని పేర్కొన్నారు. ఎంపిలు వంగ గీత, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన 2.0లో భాగంగా 2019-20లో రూ.17.76 కోట్లు, 2020-21లో రూ.8.32 కోట్లు , పిఎంకెవివై 3.0లో భాగంగా 2020ు21లో రూ.2.46 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు.
విశాఖ కేంద్రంగా ప్రతిపాదిత కొత్త రైల్వే జోన్‌లో వాల్తేర్‌ డివిజన్‌ను చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పార్లమెంటు సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి చెందిన ఒక సభ్యుడు సహా మరికొందరి నుంచి విజ్ఞప్తులు అందాయని కేంద్రం తెలిపింది. సౌత్‌ కోస్ట్‌ రైల్వే(ఎస్‌సిఆర్‌) జోన్‌ ఏర్పాటు, దాని ప్రాదేశిక అధికార పరిధిని ఏర్పాటు చేయడానికి పరిపాలనా వ్యవహారాలు, కార్యాచరణ అవసరాలతో సహా అన్ని సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే రైల్వేశాఖ నిర్ణయం తీసుకుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ప్రస్తుతం డిపిఆర్‌ పరిశీలనలో ఉన్నందున కొత్త జోన్‌ కార్యాచరణకు ఎలాంటి కాలపరిమితిని నిర్ణయించలేదని టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
పప్పుధాన్యాల కృత్రిమ కొరత, ధరల పెరుగుదలపై ఈనెల 2న ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ యాక్ట్‌ ప్రకారం పెసర పప్పు మినహా అన్ని పప్పుధాన్యాలపై స్టాక్‌ పరిమితిని విధించినట్లు కేంద్ర పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి తెలిపారు

Also read

Total Page Visits: 115 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed