SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పెత్తనంపైనే ఉన్న శ్రద్ధ… పంపిణీపై ఏదీ? కావేరిలో ఒక ల .. కృష్ణా, గోదావరిలో ఇలా..!

1 min read

పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులకన్నా ఎక్కువగా కష్టపడ్డాం. ప్రతి అక్షరాన్ని అత్యంత జాగ్రత్తగా రూపొందించాం. ‘ కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించి గెజిట్‌ విడుదల సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి అన్న మాటలివి. ఇంత శ్రద్ధగా రూపొందించిన గెజిట్‌లో నీటి పంపిణీ సజావుగా సాగడానికి అవసరమైన ప్రాధమిక ఏర్పాట్లను సైతం విస్మరించడం విస్మయం కలిగిస్తుంది. అదేసమయంలో భారీ ప్రాజెక్టుల నుండి పిల్లకాలువల వరకు పెత్తనాన్ని చేజిక్కించుకున్న తీరు చూస్తే కేంద్ర ప్రభుత్వ అసలు దృష్టి దేనిపైనో స్పష్టమవుతుంది. కావేరి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు సందర్భంగా 2018 జూన్‌ ఒకటిన జారీ చేసిన గెజిట్‌ను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల జలవివాద పరిష్కారం పేరుతో తాజాగా జారీ చేసిన గెజిట్‌లు ఎంత లోపభూయిష్టంగా, ఏకపక్షంగా ఉన్నాయో అర్ధమవుతుంది.

కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి వర్తించే కావేరి నదీ జలాల యాజమాన్య బోర్డులో రాష్ట్రాల ప్రతినిధులనూ సభ్యులుగా నియమించారు. ‘ఆయా రాష్ట్రాల జలవనరుల శాఖల పాలనా కార్యదర్శులను ‘పార్ట్‌టైం మెంబర్స్‌’గా రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తాయి’ అని కావేరి గెజిట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే, బోర్డు నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు తవ వాదన వినిపించే అవకాశం ఉంది. నిజానికి ఇది రాష్ట్రాల హక్కు! అయితే, తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా , గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డుల్లో మాత్రం రాష్ట్రాలకు అటువంటి అవకాశాన్ని ఇవ్వడానికి కేంద్రం నిరాకరించింది. ‘ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులెవ్వరు బోర్డుకు ఛైర్మన్‌గా, సభ్య కార్యదర్శిగా, సభ్యులుగా, చీఫ్‌ ఇంజినీర్లుగా నియమితులు కారు’ అని స్పష్టంగా పేర్కొంది. కావేరి బోర్డుకు ఆ రకంగా, తెలుగు రాష్ట్రాల బోర్డులకు ఈ రకంగా నిర్ణయం ఎందుకో అర్ధం కాదు. స్థానికులకు ప్రాతినిధ్యమే లేకపోతే పిల్లకాలువల దాకా విస్తరించిన వ్యవస్థలో స్థానిక సమస్యలు ఏ మేరకు ప్రస్తావనకు వస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.రెగ్యులేషన్‌ కమిటీతో నియంత్రణ..


రిజర్వాయర్ల నిర్వహణతో పాటు నీటి విడుదలను పర్యవేక్షించడానికి కావేరి బోర్డు పరిధిలో ఒక రెగ్యులేషన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. రెగ్యులేషన్‌ కమిటీ సలహా, సంప్రదింపులు, సహకారంతో కావేరి బోర్డు పనిచేస్తుంది. బోర్డు గెజిట్‌లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనడంతో పాటు, రెగ్యులేషన్‌ కమిటీలో సభ్యుల పొందిక, అది చేయవలసిన పనులను సవివరంగా పేర్కొన్నారు. రెగ్యులేషన్‌ కమిటీలో కూడా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించారు. చీఫ్‌ ఇంజినీర్‌ స్థాయికి తగ్గకుండా రాష్ట్రాల అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉండాలని నిర్ణయించారు. దీంతో పాటు వాతావరణ శాఖకు చెందిన ఒక అధికారి, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయశాఖకు చెందిన మరో అధికారికూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ సభ్యుల ప్రాధాన్యత ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జారీ చేసిన కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌లో ఈ తరహా ఏర్పాటే లేదు. పైగా ఇప్పటిదాకా వివిధ ప్రాజెక్టుల వద్ద ఉన్న సిబ్బంది కూడా బోర్డు పరిధిలోకి వెళ్లి… వారు ఏం చెబితే అది చేయాల్సి వస్తుంది.పంపిణీ అక్కడ అలా…


కావేరి బోర్డు గెజిట్‌లో నీటి పంపిణీకి సంబంధించి పలు కీలక అంశాలను పేర్కొన్నారు. ప్రతి ఏడాది జూన్‌ ఒకటవ తేది నుండే బోర్డు పని ప్రారంభమవుతుంది. రెగ్యులేషన్‌ కమిటీ సహకారంతో రిజర్వాయర్లలో అప్పటికే ఉన్న నీటి నిలువలను మదింపు చేయడం, వాతావారణ శాఖ ఇచ్చే సమాచారంతో వర్షాలు, వరదల పరిస్థితిని అంచనా వేయడం, రాష్ట్రాల నుండి నీటి అవసరాల అంచనాలను సేకరించడం ఈ కసరత్తు అంతా జూన్‌లోనే జరగాలని పేర్కొన్నారు. వీటి ఆధారంగా అందుబాటులో ఉన్న నీటి నిలువలను పదిరోజుల విరామంతో ప్రతి రాష్ట్రానికి అందిస్తారు. ఈ ప్రక్రియ అంతా రెగ్యులేషన్‌ కమిటీ పరిశీలిస్తుంది. వరదలోస్తే ఏం చేయాలి… కరువు నెలకొంటే ఎలా స్పందించాలి? రైతులకు దిశా నిర్ధేశం చేసే బాధ్యత ఎవరిది? జలవిద్యుత్‌ ఎలా…! ఈ వివరాలన్నీ సోదాహరణంగా వివరించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటివిడదల నిర్ణయాలను సమీక్షించే అధికారాన్ని కూడా రెగ్యులేషన్‌ కమిటీకి అప్పగించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జారీ చేసిన గెజిట్‌లో పంపిణీ వ్యవస్థలకు సంబంధించిన ప్రస్తావనే లేదు. అదే సమయంలో కాలువలు, పిల్లకాలువలను సైతం బోర్డు పరిధిలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. నీటి విడుదల ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు? అన్నఅ అంశాల ఊసు లేదు.అంతరాష్ట్ర ప్రాజెక్టులే…


కావేరిగెజిట్‌ ప్రకారం మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి సరిహద్దులతో సంబంధం ఉన్న ప్రాజెక్టులోనే బోర్డు పరిధిలోకి తీసుకువచ్చారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన ప్రకాశం బ్యారేజి, వెలిగొండ, ధవళేశ్వరం బ్యారేజీలను కూడా తీసుకురావడం గమనార్హంకేంద్ర వాటా…


కావేరి బోర్డు ఏర్పాటు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రెండు కోట్ల రూపాయలను విడుదల చేసింది. భాగస్వాములైన రాష్ట్రాలు కూడా అంతే మొత్తాన్ని కేటాయించాయి. తెలుగురాష్ట్రాలకు జారీ చేసిన గెజిట్‌లో కేంద్ర వాటాగా ఒక్కటంటే ఒక్క రూపాయిని కూడా కేటాయించలేదు గెజిట్‌ విడుదలైన ఆరురోజుల్లో సీడ్‌మనీగా రెండు రాష్ట్రాలూ ఒకొక్కటి రెండు వందల కోట్ల రూపాయలను విడుదలచేయాలని, నిర్వహణకు అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో జమ చేయాలని పేర్కొంది.పై రాష్ట్రాల సంగతేంటి?


కావేరి బోర్డు పరిధిలోకి నదిపరివాహ ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలను తీసుకువచ్చారు. కృష్ణా, గోదావరి నదులకు కేంద్రం ఏర్పాటు చేసిన యాజమాన్య బోర్డుల పరిధిలోకి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే వస్తాయి. ఎగువన ఉన్న రాష్ట్రాలను ఈ బోర్డుల పరిధిలోకి చేర్చలేదు. ఆ రాష్ట్రాల నీటి వినియోగాన్ని. ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఎవరు పర్యవేక్షిస్తారో స్పష్టత లేదు. వేరే బోర్డు ఏర్పాటు చేస్తారా? చేస్తే రెండు బోర్డులూ పనిచేస్తాయా? సమన్వయం ఎలా ఈ ప్రశ్నలకు జవాబు లేదు.

Also read

Total Page Visits: 97 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed