SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

జాతీయ స్థాయిలో అంతర్జాలం ద్వారా కవిత్వంతో కాసేపు కవిసమ్మేళనం*

1 min read


హైదరాబాదు


* *కవిత్వాన్ని అధ్యయనం చెయ్యాలి*

* *కవులందరికీ సాహిత్య పరిభాష కావాలి*

* *కవిత్వమే కవికి శ్వాస*

* *కవిత్వం యొక్క తాత్వికత,తారికినత లక్షణాలు ఉండాలి*

తెలుగువెలుగు సాహిత్యవేదిక ఎస్ వి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలం ద్వారా కవిత్వంతో కాసేపు కవిసమ్మేళనం సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు సుమారు ఆరు గంటలు సమ్మేళనంలో 120 మంది కవులు ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్ ,కర్ణాటక,దుబాయ్ తదితర రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు .ఈ కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకునిగా కళా గౌతమి పత్రికా సారధి డాక్టర్ బులుసు సత్యనారాయణ మూర్తి తనదంటూ శైలి లో విలువలకు కట్టుబడి నిబద్ధత తో సాహిత్య కార్యక్రమాలను నడిపే వ్యక్తి! క్రొత్త కవులను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తూ ఉంటారు. విషయ పరిజ్ఞానంలో,విశ్లేషణలో దిట్ట. మాంచి చదువరి. తనకు తెలిసిన విషయాన్ని నిష్కర్షగా ఆధారాలతో నిరూపించి మాట్లాడుతారు.ప్రాచీన సాహిత్యం పై కృషి ఉంది.ఆధునిక సాహిత్యం పై వ్యతిరేకత లేదు.సాహిత్య పరిమళాలు ఎక్కడ వీచినా ఆశ్వాదిస్తారు. 1980 లో *తెలుగు కన్నడ భారతం తులనాత్మక పరిశీలన* అనే అంశం పై పరిశోధన చేసి డాక్టరేట్ పుచ్చుకున్నారు.స్కూల్ అసిస్టెంట్ గా పది సంవత్సరాలు పని చేసి, గౌతమీ విద్యా పీఠం ఓరియంటల్ కళాశాలలో తెలుగు ఉపన్యాస కునిగా పదవీ విరమణ చేశారు.రాజమహేంద్రవరం లో నేటికీ సేవచేస్తూ,విద్యార్థులకు సాహిత్యం పై పోటీలు పెట్టీ నగదు బహుమతులు ఇస్తారు. ప్రముఖ వక్తలను పిలిచిఎన్నో సాహిత్య ఉపన్యాసాలు,ఉగాది కవి సమ్మేళనాలు, ప్రతి రెండవ ఆదివారం కవి సమ్మేళనం, భాషా పరిరక్షణకు తీసుకోవలసిన చర్చలు, పుస్తకావిష్కరణ లు , కళా గౌతమి వేదిక ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఎన్నో సత్కారాలు పురస్కారాలు పొందారు. నిగర్వి తనం ఆయనకు పెట్టని ఆభరణం. అటువంటి గొప్ప సాహితీవేత్తలు కలుసుకోవడం మనందరికీ ఆనందకరం. ఆయన నోటి వెంట వచ్చే పలుకులు వినడం మన అదృష్టం . ఈ సందర్భంగా డాక్టర్ బులుసు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ కవులందరికీ కవిత్వాన్ని అధ్యయనం చెయ్యాలని అన్నారు అలాగే ప్రముఖ కవి రచయిత విశ్లేషకులు విమర్శకులు కీలపర్తి దాలినాయుడు మాట్లాడుతూ కవులందరికీ సాహిత్య పరంగా పరిభాష కావాలని తెలిపారు. కవి రచయిత విశ్లేషకులు సాహితీ వేత్త గంటా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కవిత్వమే కవికి శ్వాస అన్నారు. కవి రచయిత విశ్లేషకులు ఉపాధ్యాయులు మీసాల చిన గౌరీ నాయుడు మాట్లాడుతూ కవిత్వం యొక్క తాత్వికత , భావుకత్వం, కథ విశ్లేషణ లక్షణాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తొలిపలుకులు తెలుగు వెలుగు సాహితీ వేదిక అధ్యక్షులు మూర్తి, ఎస్ వీ ఫౌండేషన్ ఛైర్మన్, కవి, వ్యాఖ్యాత సభాధ్యక్షులు మోటూరి నారాయణరావు మాట్లాడుతూ .. కవి అనేవాడు నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వారుఉండాలని తెలుగు భాషని కాపాడాలని అన్నారు
ఈ కార్యక్రమంలో ప్రార్థనాగీతం చొప్పదండి రాధా ఆలపించారు సమన్వయకర్తలుగా బీ మల్లేశ్వరమ్మ పాండ్రంగి శారద పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి చెబియం శ్రీనివాసరావు ముగింపు పలుకులు పలికి వందనసమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో మేడిశెట్టి యోగేశ్వర్ జక్కాని గంగాధరరావు కొత్తపల్లి సుబ్బారావు గా ముద్ర గోవిందరావు రావాలి కృష్ణకుమారి పోచం సుజాత కు తమ తిరుమలలో పోలయ్య కవి నాగేశ్వర్రావు కవులు ,కవయిత్రులు, సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Total Page Visits: 25 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed