SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను ఖరారు చేసిన కేంద్రం

1 min read


ఢిల్లీ: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను కేంద్రం ఖరారు చేసింది. రేపు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులపై రెండు గెజిట్‌ నోటిఫికేషన్లను కేంద్రం విడుదల చేయనుంది. అలాగే ప్రాజెక్టుల నిర్వహణ, క్రమబద్ధీకరణ, సంరక్షణలపై ఇరు రాష్ట్రాల పరిధులను కేంద్రం స్పష్టం చేయనుంది. 2014 పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉన్నా అసాధారణంగా ఏడేళ్లపాటు ఆలస్యమైంది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధి నిర్దేశించేందుకు 2020 అక్టోబరు 6న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జల్‌శక్తి మంత్రితో కూడిన అపెక్స్‌ కమిటీ సమావేశమైనప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం బోర్డుల పరిధి నిర్దేశించే అధికారం కేంద్రానికి ఉంటుందని జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది.

Also read

Total Page Visits: 48 - Today Page Visits: 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed