SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఎంపీ నే దూషిస్తారా…తేలిగ్గా తీసుకొను

1 min read




న్యూ ఢిల్లీ..ఈరోజు మధ్యాహ్నం సుమారు 11.50, 12.00 గం సమయంలో పార్లమెంటు సెంట్రల్ హాల్ లో పలువురు సహచర పార్లమెంటు సభ్యులతో నేను మాట్లాడుతుండగా మా పార్టీ పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ నా వద్దకు వచ్చి సభ్యసమాజం తలదించుకునే రీతిలో ఎంతో అసభ్యకరమైన పదాలతో నన్ను బూతులు తిడుతూ నా అంతు చుస్తానంటూ బెదిరించడం జరిగింది. పదిమందిలో అతనిపై తిరిగి స్పందించడం సరికాదని ఆ సమయంలో సంయమనం పాటించి జరిగిన విషయం గౌరవనీయ లోక్ సభ స్పీకర్ గారికి తెలుపుతూ లేఖ రాసి వ్యక్తిగతంగా పలువురు ఎంపీలతో కలిసి అందజేయడం జరిగింది. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకుంటానని గౌరవ లోక్ సభ స్పీకర్ గారు హామీ ఇవ్వడం జరిగింది.

ఈ విషయాన్ని నేను అంత తేలికగా వదిలేయాలని అనుకోవడం లేదు ఒక పార్లమెంటు సభ్యునిపై పార్లమెంటు సెంట్రల్ హాల్ లోనే ఇలా అసభ్య పదజాలంతో దాడి చేయడం వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు అవసరమైతే ప్రధానమంత్రి గారి దృష్టికి మరియు కేంద్ర హోంమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు వెనుకాడను.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పదలచుకున్నాను, ఇటువంటి హత్యా బెదిరింపులు మానుకుంటే మంచిది, జరిగిన ఈ సంఘటన వెనుక నిజంగా మీ ప్రమేయం లేకపోతే ఎంపీ గోరంట్ల మాధవ్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

రఘురామకృష్ణ రాజు

Also read

Total Page Visits: 175 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed