SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

హైదరాబాద్‌ పాతబస్తీలో మంత్రాల పేరుతో బాబా ఘాతుకం

1 min read

హైదరాబాద్‌: మంత్రాల పేరుతో ఓ దొంగ బాబా ఘాతుకానికి ఒడిగట్టాడు. హైదరాబాద్‌ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గౌస్‌ నగర్‌ ప్రాంతంలో మంత్రాల పేరుతో ఇద్దరు యువతులపై దొంగ బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లికి వైద్యం కోసం వచ్చిన యువతులపై బాబా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వారిలో ఓ యువతికి గతంలో విడాకులిప్పించిన బాబా.. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు తేలింది. బాబా కుమారుడు సైతం వివాహితపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. వైద్యం పేరుతో ఆర్థికంగా కుంగదీసినట్లు బాధితులు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. బాబా, అతని కుమారుడిని అరెస్టు చేశారు.

Also read

Total Page Visits: 158 - Today Page Visits: 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed