SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కావలి జాతీయ రహదారి పక్కన బీటెక్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి

1 min read

నెల్లూరు జిల్లా కావలిలో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కావలి పట్టణ పరిధిలోని తుమ్మలపెంట జాతీయ రహదారి పక్కన శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. కావలి డీఎస్పీ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కావలి జాతీయ రహదారిపై గస్తీ నిర్వహిస్తున్న మొబైల్‌ అధికారులు తుమ్మలపెంట జాతీయ రహదారి పక్కన సగం కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే వారు కావలి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కావలి గ్రామీణ సీఐ ఖాజావళి, ఎస్‌ఐ వెంకట్రావులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు చనిపోయిన ప్రదేశంలో సగం కాలిపోయిన సెల్‌ఫోన్‌ను గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా మృతుడి వివరాలు సేకరించారు. మృతుడు ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు గ్రామానికి చెందిన రాజేందర్‌గా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడు పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రాజేందర్ వేసుకున్న దుస్తులు, శరీరం కొంతమేర కాలిపోవడంతో ఎవరైనా హత్య చేశారా? లేదా తానే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Also read

Total Page Visits: 93 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed