SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పెళ్లిళ్ల పేరుతో మోసాలు..వెలుగులోకి మరో నిజం

1 min read

యువకులను ప్రేమ, పెళ్లిళ్ల పేరుతో మోసం చేసి నగలు, నగదుతో ఉడాయించే సుహాసిని ఆర్థిక మోసాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. ఆమె అవసరాల పేరుతో అప్పులు చేసి మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమెను అరెస్టు చేశారన్న సమాచారం తెలుసుకున్న నెల్లూరు జిల్లాకు చెందిన వీరయ్య తిరుపతికి వచ్చి అలిపిరి పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు.

సుహాసిని తనకు చిన్నప్పటి నుంచి తెలుసని.. ఆమె తన మేనమామ వెంకటేశ్వర రాజుతో మొదటి వివాహం. చేసుకుందని.. ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పటి ఫొటోలు చూపించి వైద్యం కోసం అప్పు అడిగిందని చెప్పాడు. ప్లాట్ పేపర్లు చూపించి 10 రోజుల్లో అమ్మి అప్పు తీర్చేస్తానని రూ. 2.17 లక్షల అప్పు తీసుకుందని.. ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా.. ఇస్తానని నమ్మించి మూడేళ్లు ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పాడు. భద్రాది కొత్తగూడెంకు చెందిన వినయ్, తిరుపతికి చెందిన మరో యువకుడిని ఆమె మోసం చేసిందని.. మొదటి భర్తకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయని వీరయ్య చెప్పాడు. సుమారు 20 నుంచి 30 మంది వరకు సుహాసిని చేతిలో మోసపోయారని.. ఏవేవో కారణాలతో వారు బయటకు రాలేని పరిస్థితి ఉందని.. తన డబ్బులు తిరిగి ఇప్పించాలని వీరయ్య కోరారు. అలిపిరి పోలీసులు కూడా ఆమె ఈ తరహా మోసాలు చేసిందని చెప్పారు. సుహాసిని నిత్యపెళ్లి కూతురు అవతారమెత్తి పలువురిని మోసం చేసిన విషయం తెలిసిందే. కొంత మంది యువకుల ఫిర్యాదుతో సుహాసిని బండారం బయటపడింది. పలువురిని తన అందంతో ఆకర్షించినట్టుగా సమాచారం.

Also read

Total Page Visits: 404 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed