SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ప్రేమించాడని.. యువకుడి మర్మాంగం కోసి దారుణ హత్య

1 min read

బిహార్ ముజఫర్పుర్ జిల్లాలో శనివారం దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిని.. తాను ప్రేమించిన యువతి సోదరులే అత్యంత కిరాతకంగా హత్య చేశారు. దాంతో ఆగ్రహానికి గురైన బాధితుడి కుటుంబ సభ్యులు.. అతడి మృతదేహాన్ని నిందితుల ఇంటి ముందే దహనం చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి….


ముజఫర్పుర్ జిల్లా.. రామ్పురుశాహ్ ఏరియాకి చెందిన సౌరభ్రాజ్(22).. సోనావర్ష గ్రామానికి చెందిన ఓ యవతి ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమను యవతి సోదరులు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వారు సన్నిహితంగా మెలగడం ఓర్వలేక శనివారం దారుణానికి ఒడిగట్టారు. తన ప్రేయసి పిలుస్తున్నట్లుగా నమ్మించి సౌరభ్ను తమ ఇంటి వద్దకు పిలిపించారు. అనంతరం.. అతడ్ని గదిలో బంధించి తీవ్రంగా దాడి చేశారు. అంతేకాకుండా.. సౌరభ్ మర్మాంగం కోసి చిత్రహింసలు పెట్టారు. దాంతో తీవ్ర రక్తస్రావం కాగా చనిపోతాడని భావించిన నిందితులు.. సౌరభ్ను ఓ ఆస్పత్రిలో చేర్చి ఎస్కేప్ అయ్యారు. అయితే.. అక్కడే అతడు మృతి చెందాడు. సౌరభ్ చనిపోవడంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనతో అతని గ్రామస్థులంతా ఆగ్రహానికి గురయ్యారు. పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం.. సౌరభ్ డెడ్‌బాడీని తీసుకుని వచ్చి నిందితుడి ఇంటి ముందుకు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని ఆ ఇంటివద్దే దహనం చేశారు. ఈ ఘటనలో పోలీసులు.. పలువురిపై కేసు నమోదు చేశారు. ఉద్రిక్తతలు నెలకొనగా.. పోలీసులు భారీగా మోహరించారు. ఒడిశాలోని ఓ ప్రైవేట్ సంస్థలో సౌరభ్ రాజ్ పని చేస్తుంటాడని సమాచారం. తన సోదరి వివాహం ఉన్నందున జులై 1నే అతడు సెలవులపై ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది.

Also read

మార్చి 27న లగ్జరీ లాడ్జిలో దిగిన మహిళ.. రూ. 1.80 లక్షల బిల్లు, చివరికి.. చుక్కలు చూపింది!

Total Page Visits: 196 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed