SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు నిడదవోలు పట్టణ పోలీసులు

1 min read

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో తాళం వేసి ఉన్న ఇళ్లను పగలగొట్టి బంగారు, వెండి ఆభరణములు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను నిడదవోలు పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో సోమవారం సాయంత్రం s. v.r.k కళాశాల సమీపంలో నిడదవోలు పట్టణ పోలీసులు వాహన తనిఖీలు చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న మల్లేశ్వరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతను మే 15వ తేదీన తణుకు సబ్ జైలు నుండి విడుదల అయ్యి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అనేక దొంగతనాలకు పాల్పడినట్లు s.i p. నాగరాజు తెలిపారు. మల్లేశ్వరరావు పై విజయనగరం, శ్రీకాకుళం, రాజాం, నిడదవోలులో పలు కేసులు నమోదయ్యాయని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అశ్వరావుపేట లో కూడా ఒక కేసు నమోదు నమోదయింది. ఇతని వద్ద నుండి 3 లక్షల రూపాయల విలువచేసే మూడున్నర కేజీల వెండి వస్తువులు, సుజుకి యాక్సెస్ వాహనము స్వాధీనం చేసుకున్నారు. ఇతనిని వైద్య పరీక్షల అనంతరం నిడదవోలు కోర్టులో హాజరు పరుస్తామని ఎస్ఐ నాగరాజు అన్నారు.

Total Page Visits: 79 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed