SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కుమార్తెను చెరబట్టిన కన్నతండ్రి.. పలుమార్లు అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి

1 min read

ప్రకాశం జిల్లా లో దారుణం ఘటన …కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. ఆ బాలికపై కన్నేశాడు. 15 ఏళ్ల కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఈ దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని

Also read




కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. ఆ బాలికపై కన్నేశాడు. 15 ఏళ్ల కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఈ దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు

ప్రకారం.. ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి దూరంగా ఇల్లు నిర్మించుకకొని ఉంటున్నాడు. ఈ క్రమంలో జనవరి నెలలో బాలిక తల్లి సరకుల తీసుకొచ్చేందుకు పక్కనే ఉన్న సంగరపల్లి గ్రామానికి వెళ్లింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అప్పటి నుంచి పలు దఫాలుగా అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ విషయం బయటికు చెబితే తల్లి, కూమార్తెను చంపేస్తానంటూ కసాయి తండ్రి బెదిరించేవాడు. ఈ క్రమంలో తండ్రి తరచూ బాలికను కొడుతుండటంతో సుమారు 20 రోజుల కిందట 100 నంబరుకు ఫోన్‌ చేసింది. పోలీసులు వెళ్లి తండ్రిని మందలించారు. ఆ తరువాత బాలిక తాత ఇంటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని వాళ్లకు చెప్పడంతో బుధవారం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి పక్కన ఎవరూ లేకపోవడంతో.. ఇంతకాలం బాలిక తండ్రికి భయపడి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు

Also read

Total Page Visits: 165 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed