SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్టు

1 min read

పాడేరు (విశాఖ):విశాఖ జిల్లాలోని పిల్లలను కిడ్నాప్‌ చేసి వారిని పిల్లలు లేనివారికి అక్రమంగా అమ్మకాలు జరుపుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పాడేరులో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్‌పి బి.కృష్ణారావు వెల్లడించారు. ఎస్‌పి తెలిపిన వివరాల ప్రకారం.. డుంబ్రిగుడ మండలం అరకు సంతబయలు ప్రాంతంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సంచార కుటుంబానికి చెందిన ఆరు నెలల శిశువు అర్ధరాత్రి సమయంలో కిడ్నాప్‌నకు గురైంది. దీనిపై వారం రోజుల క్రితం డుంబ్రిగుడ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్‌పి కృష్ణారావు, పాడేరు ఎఎస్‌పి జగదీష్‌ ఆదేశాల మేరకు అరకులోయ సిఐ జి.దేముడుబాబు తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. సబ్బవరం మండలం జి.భీమవరం ప్రాంతంలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా చిన్న పిల్లల కిడ్నాప్‌, అక్రమ అమ్మకాల ముఠా వ్యవహారం వెలుగు చూసింది. ఈ కిడ్నాప్‌లో కీలకమైన విశాఖ నగరంలోని చినముషిడివాడకు చెందిన పెంటకోట మహేశ్వరి (20), అల్లిపురానికి చెందిన కొప్పుల క్రాంతి(25), పెందుర్తికి చెందిన ఘోష ఆస్పత్రిలోని సెక్యూరిటీ గార్డు నీలపు మణి (30), ఆమెతో సహజీవనం చేస్తున్న ఆటో డ్రైవర్‌ పొలమరిశెట్టి రమేష్‌(36)తో పాటు పది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.2.50 లక్షల నగదు, సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇప్పటికే నలుగురు శిశువులను కిడ్నాప్‌ చేసి అమ్మకాలు జరిపినట్లు రుజువైందని, వారిని వారి వారి తల్లిదండ్రులకు అప్పగించామని ఎస్‌పి తెలిపారు.

Also read

బంధువుల ఇంట్లో గృహ ప్రవేశం.. పెరుగు తెస్తానని వెళ్లి…ట్రాక్టర్‌ ఢీ

Total Page Visits: 284 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed