SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నగరంలో సెల్ ఫోన్ దొంగల స్వైరవిహారం

1 min read

**

ఒంగోలు: అసలే కరోనా వ్యాప్తితో స్కూల్స్ బందైపోగా పిల్లలకు ఆన్లైన్ తరగతుల పేరిట ఖరీదైన సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. అందరూ వాటిని కొనడం చేస్తున్నారు. మరికొందరు అవసరం లేకపోయినా స్నేహితులతో సమానంగా ఉండటానికి, గొప్పకోసం, పాతఫోన్ మార్చి ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ ఫోన్లు కొనడం ఎక్కువైపోయింది. మధ్యతరగతి కుటుంబాలలో ఉదయమంతా పిల్లల దగ్గర ఫోన్ ఉంటుంది, సాయంత్రమెప్పుడో పెద్దలు ఫోన్ దగ్గర ఉంచుకోవడం జరుగుచున్నది.
ఫోన్ దొంగలు ఖరీదైన బట్టలు, స్పీడ్ మోటార్ బైక్ పై తిరుగుచున్నారని కొందరు వ్యాఖ్యానించారు.
ఈ నేపధ్యంలో కొందరు యువకులు ఏదో ఒక వస్తువు కొనుగోలు సాకుతో షాపుల వద్దకు వచ్చి షాపు ఓనర్స్ ను మాటల్లో పెట్టి ఆ వస్తువు అడిగి తను ఆ వస్తువు తెచ్చి ఇచ్చేలోగా షాపులోని వ్యక్తుల ఫోన్ చాకచక్యంగా చోరీచేయడం ఎక్కువై పోయినాయి.
కొందరు దొంగలు రద్దీగా ఉన్నచోట, మరికొందరు ఒంటరిగ షాపు వారు ఉన్నచోట చోరీలు చేయడం ఎక్కువైపోయింది.
రోజూ పదుల సంఖ్యలో ఫోన్ పోగొట్టుకొన్న వారు పోలీసులను ఆశ్రయించడం జరుగుచున్నదని పోలీసు వర్గాలు తెలిపారు. ఫోన్ ఖరీదు రసీదు, ఫోన్ ఐ.యం.ఇ.ఐ నంబరు తెలిపి స్పందనలో రిజిస్టర్ చేయించు కొంటే ఫోన్ వెతకడం సులభమౌతుందని తెలిపారు.
ఖరీదైన ఫోన్ కొనుగోలు చేసినప్పుడు ఇన్సూరెన్స్ చేయించడం ముఖ్యమని, ఫోన్ పోయినప్పుడు సరైన కారణాలు చూపితే ఇన్యూరెన్స్ సంస్థలు ఆర్ధికంగా ఆదుకొంటాయని వివరించారు.

Total Page Visits: 29 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed