SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నకిలీ వాహన భీమాపాలసీలు చేస్తున్న ముఠాలు అరెస్ట

1 min read

నకిలీ వాహన భీమా పాలసీలు చేస్తున్న రెండు ముఠాలకు చెందిన 8మంది నిందితులతో పాటు అనాధికారికంగా వాహన రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సు కార్డులను కలిగి వున్న రోడ్డు రవాణా విభాగం కార్యకలపాలను నిర్వహించే మరో ఇద్దరు దళారీలతో పాటు మొత్తం పది మంది నిందితులను టాస్క్ ఫోర్స్, మీ కాలనీ, ఇంతేజారగంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేశారు.*

*వీరి నుండి 4లక్షల 46వేల నగదు, 3 ల్యాప్ ట్యా న్లు , 2 డెస్క్టాప్ కంప్యూటర్లు, 4 ప్రింటర్లు, 5ద్విచక్ర వాహనాలు, వది సెల్ ఫోన్లతో పాటు 433 వాహన రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సు కార్డులు, రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు, నకిలీ భీమా పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.*

*పోలీసులు అరెస్టు వారిలో 1. యం.డి షఫీ, కొండపర్తి, ,ఐనవోలు మండలం, వరంగల్ జిల్లా, 2.సయ్యద్ జాహంగీర్, బాలాజీనగర్, కాశీబుగ్గ, వరంగల్ జిల్లా. 3. పెన్నల రాజేష్, పుప్పాలగుట్ట, వరంగల్ జిల్లా. 4. వాంకిడి నిఖిల్, లెనిన్ నగర్, వరంగల్, 5. మామిడి రాజు, శివనగర్, వరంగల్, B.నాగమల్లి శివకుమార్, కాశీబుగ్గ, వరంగల్, 7.అల్లాడి రాజేష్, హంటర్ రోడ్డు, శాయంపేట్, హన్మకొండ. 8. గుండబోయిన శ్రీకాంత్, వంగపహాడ్, హసన్‌పర్తి మండలం, హన్మకొండ, 9. కేశోజు రాజ్ కుమార్, గుడిబండల్, హన్మకొండ, 10. బల్లాని సమన్, మాదన్నపేట, నర్సంపేట, వరంగల్ జిల్లా.*

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ నిందితులందరు కుడా వాహన భీమా మరియు రోడ్డు రవాణా శాఖ దళారీలుగా వరంగల్ రోడ్డు రవాణా శాఖ కార్యాలయము పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. నిందితులందరు వాహనదారులకు అవసరమయిన వాహన భీమాకు సంబంధించి రెన్యూవల్ చేయించడం, వాహన రిజిస్ట్రేషన్, లైసెన్లను ఇప్పించడం చేసేవారు. ఈ విధంగా నిందితులను వచ్చే అదాయం సరిపోకపోవడంతో నిందితులు నకిలీ భీమా రెన్యూవల్స్ పై దృష్టి సారించారు. ఇందుకోసం నిందితులు వివిధ రకాల యాప్స్ మరియు సాఫ్ట్వేర్లను సేకరించారు. ముందుగా తమ వద్దకు వాహన భీమా రెన్యూవల్ చేయించుకోనేందుకు వచ్చేవారిలో అమాయకంగా కనిపించే వారికి నిందితులు ముందుగా రెన్యూవల్ చేయాల్సిన అసలు భీమా పత్రాన్ని ఫోటోను యాప్స్ మరియు సాఫ్ట్వేర్ ద్వారా అసలు
భీమా పాలసీ పత్రంలో సమాచారాన్ని సవరించడంతో పాటు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన దోరకుండా వుండేందుకుగాను ఆండ్రాయిడ్ యాలతో క్యూఆర్ కోడ్లను రూపొందించిన నిజమైన భీమాపాలసీ పత్రంగా రూపొందించి వాహనదారులకు అందజేసేవారు. ఈ విధంగా నిందితులు ప్రవైయిట్ వాహన భీమా సంస్థలకు సంబంధించి నకిలీ బీమా పాలసీ రెన్యూవల్స్ చేసారు. ఇందుకోసం వాహనదారుల నుండి 2వేల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు వసూళ్ళు చేసేవారు. ఈ విధంగా నిందితులు గత కొద్ది సంవత్సరాలు ఈ నకిలీ వాహన బీమా పాలసీ రెన్యూవల్స్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం నిందితుల వద్ద వాహన బీమా పాలసీ రెన్యూవల్ చేయించుకున్న వాహనదారుడి వాహనం ప్రమాదానికి గురికావడంతో బీమా సంస్థ ద్వారా తమ వాహనానికి మరమ్మత్తులు నిర్వహించేందుకుగాను సదరు వాహనదారుడు బీమా సంస్థను సంప్రదించగా వాహనం యొక్క బీమా పాలసీ రెన్యూవల్ చేయని కారణంగా బీమా క్లయిం వర్తించడని సంస్థ సిబ్బంది తెలపడంతో కంగుతిన్న వాహనదారుడు తాను మోసపోయినట్లుగా గుర్తించి టాస్క్ఫోర్సకు సమాచారం అందించడంతో పాటు ఇంతేజా గంజ్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు జరిగింది. వాహనదారుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్ఫర్స్ పోలీసులు ఇంతేజా గంజ్ మరియు మీల్స్ కాలనీ పోలీసులతో కల్సి నిందితుల కార్యాలయాలపై దాడులు నిర్వహించిన నిందితులను అదుపులోకి విచారించగా నిందితులు పాల్పడిన మోసాన్ని అంగీకరించడంతో పాటు, రోడ్డు రవాణా శాఖ కార్యాలయములో విధులు నిర్వహించే సిబ్బంది అనధికారికంగా అందజేసిన రిజిస్ట్రేషన్, లైసెన్సు కార్డులు, రోడ్డు రవాణా శాఖ అధికారికి సంబంధించిన రబ్బర్ స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకోని కేసులు నమోదు చేయడం జరిగింది. నిందితులు ఇప్పటి వరకు 2వేల నుండి పదివేల మంది వాహనదారులను మోసం చేయడంతో పాటు సూమారు 90లక్షల రూపాయలు ప్రభుత్వ అదాయానికి గండి కోట్టారని పోలీసుల విచారణ తెలిసింది.
ఈ ముఠా సభ్యులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డిసిపి టాస్క్ఫ ర్స్ ఇంచార్జ్ వైభవ్ గైఖ్వాడ్, టాస్క్ఫో ర్స్ ఇన్స్ స్పెక్టర్ సంతోష్, ఎస్.ఐలు లవ కుమార్, ప్రియదర్శిని, అంతేజా గంజ్, మీ కాలనీ ఎస్.బలు స్వామి, కుమారస్వామి, టాస్క్ఫర్స్ హెడ్ కానిస్టేబుల్ సోమలింగం, కానిస్టేబుళ్ళు శ్రవణ్, శ్రీనివాస్, రాజు, రాజేష్, విజయ్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

Also read

Total Page Visits: 101 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed