SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఆన్‌లైన్‌ బెట్టింగ్ సెంటర్‌గా తిరుపతి.. వందల మందిని బకరా చేసి… లక్షలు దోచేసిన ముఠా

1 min read

టెంపుల్ సిటీ తిరుపతి ఆన్‌లైన్‌ బెట్టింగ్ సెంటర్‌గా మారుతోంది. బెట్టింగ్ మాయలో పడి లక్షలు పోగొట్టుకుంటున్నారు.

టెంపుల్ సిటీ తిరుపతి ఆన్‌లైన్‌ బెట్టింగ్ సెంటర్‌గా మారుతోంది. బెట్టింగ్ మాయలో పడి లక్షలు పోగొట్టుకుంటున్నారు. హోప్‌వెల్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆర్చ్ యాప్‌కు అట్రాక్ట్ చేస్తున్న ముఠా… మాయలో ముంచి జేబులు గుల్ల చేస్తోంది. ఆన్‌లైన్ నెంబర్ బెట్టింగ్‌లో మొదటి కాస్త ఇన్‌కం రుచి చూపి… ఆ తర్వాత అసలు సినిమా చూపిస్తున్నారు. ఈజీగా బకరా చేస్తున్నారు. తిరుపతి ఈస్ట్ పీఎస్ లిమిట్స్… నెహ్రూవీధికి చెందిన పూజిత… తనభర్తతో కలిసి 5 ఖాతాల కింద… 4 లక్షలకు పైగా పెట్టి మోసపోయింది. మొదట్లో వీరు పెట్టిన అమౌంట్‌కు డబుల్ వచ్చింది. ఆ ఆశతో ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేయగా… ముంచి వదిలేశారు. ఇలా వీళ్లే కాదు… తిరుపతి సిటీలో ఎంతోమంది బెట్టింగ్ మాయగాళ్ల చేతిలో మోసపోయారు. కొందరు మోసపోయామని గుర్తించి… ఆలస్యంగా పోలీసులను అప్రోచ్ అయ్యారు.

ఆర్చ్ యాప్‌ ద్వారా నెంబర్ బెట్టింగ్ కట్టి మోసపోయినవారు తిరుపతిలో చాలామంది ఉన్నారని… అర్బన్ పోలీసులు గుర్తించారు. పూజిత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు డీప్ ఎంక్వైరీ చేస్తున్నారు. బ్యాంక్, బాధితులు ఇచ్చిన ఆధారాలతో కూపి లాగుతున్నారు. వందల మందిని బకరా చేసి… లక్షలు దోచేసిన ముఠా… పకడ్బందీగా ఫ్రాడ్ చేసిందని చెబుతున్నారు పోలీసులు. నెంబర్ బెట్టింగ్‌లో పాల్గొని మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also read

Total Page Visits: 99 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed