SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పరిచయస్తురాలైన వివాహిత అకస్మాత్తుగా మాట్లాడటం మానేయడంతో యువకుడి ఆత్మహత్య

1 min read

పరిచయస్తురాలైన వివాహిత అకస్మాత్తుగా మాట్లాడటం మానేయడంతో మనస్తాపం చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. బల్కంపేటకు చెందిన దుర్గేశ్‌ (31) రెండేళ్ల క్రితం ఓల్డ్‌ బోయిన్‌పల్లిలోని మైత్రివనం రాంరెడ్డి కాలనీలోని ఓ ఇంట్లో ఎలక్ట్రిషియన్‌గా పనిచేశాడు. ఆ సమయంలో పక్కింట్లో ఉండే వివాహితురాలితో దుర్గేశ్‌కు పరిచయం ఏర్పడిండి.


పరిచయస్తురాలిగా మారిన ఆమె ఇంట్లోనూ ఎలక్ట్రికల్‌ పనులు చేశాడు. వీరి పరిచయం బాగా పెరగడంతో దుర్గేశ్‌ తరచూ ఆమె ఇంటికి వస్తుండేవాడు. ఇటీవల ఆమె దుర్గేశ్‌తో మాట్లాడటం మానేసింది. దీంతో మనస్తాపం చెందిన దుర్గేశ్‌ గురువారం ఆ మహిళ ఇంటికెళ్లి, బెడ్‌రూమ్‌లో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Total Page Visits: 88 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed