SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

వైసీపీ నేతల వేధింపులు.. పురుగుల మందు తాగిన రైతు

1 min read


అనంతపురం: జిల్లాలో వైసీపీ నేతల వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సోమవారం రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఓ రైతును వేధింపులకు గురిచేశారు. వైసీపీ శ్రేణుల వేధింపులకు తాళలేక గొందిరెడ్డిపల్లిలోని రైతు కుల్లాయప్ప పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భూమిని వేరేవాళ్లకు పట్టా చేస్తామని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నారెడ్డి, వెంకటరామిరెడ్డి, నరసింహారెడ్డి, రాంనారాయణరెడ్డి, సత్తిరెడ్డి అనే నాయకులు తనను బెదిరిస్తున్నారని రైతు కుల్లాయప్ప తెలిపారు. అలాగే తన భార్యపై కూడా ఆ పార్టీ నాయకులు చేయి చేసుకున్నారని కుల్లాయప్ప తన బాధను వ్యక్తం చేశారు. పోలీసులు సైతం వైసీపీ నేతలకే వత్తాసు పలుకుతున్నారని కుల్లాయప్ప ఆవేదన వ్యక్తం చేశారు.

Total Page Visits: 88 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed