SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

వృద్ధురాలిపై ఓ వినాయకుడి అనుచరులు దౌర్జన్యాము

1 min read

నెల్లూరు/యాంకర్:–

అధికారం… అంగబలం ఉంటే ఏమైనా చెయ్యొచ్చు.. ఎలా అయినా చెలామణి కావచ్చు… ఎంతటి విధ్వంసానికి అయినా పాల్పడ వచ్చన్న ధోరణి నెల్లూరు నగరంలో అంతకంతకూ పెరుగుతోంది. మొన్నటికి మొన్న.. రెండు నెలల క్రితం ఓ యువకుని కొందరు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన మరువకముందే …వారం రోజుల క్రితం మాగుంట లేఅవుట్ లో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ ను అర్ధరాత్రి కొందరు విధ్వంసం చేశారు. ఈ సంఘటన మరువక ముందే తాజాగా నగరంలోని 5వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సంజయ్ గాంధీ నగర్లో వృద్ధురాలిపై ఓ వినాయకుడి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు పట్టపగలు వృద్ధురాలిపై విచక్షణారహితంగా దాడి చేశారు బీభత్సం సృష్టించారు. ఆ స్థలానికి ఆ ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేని ఆ మాజీ నాయకుడు నేరుగా ఇంట్లోకి ప్రవేశించి ద్వారా హక్కు కలిగిన వారిపై దాడులకు పాల్పడ్డారు. ఇంటి స్థలం లోకి చొరబడి విపరీతంగా కొట్టారు. ఇదేమని ప్రశ్నించే లోపు తమప్రతాపాన్ని చూపి వెళ్ళిపోయారు… అత్యంతవిలువైన ఆ వృద్ధురాలి స్థలాన్ని భలంతంగా స్వాధీనం చేసుకునేందుకు ఈ దాడులకుపాల్పడ్డారని బాధితురాలు వాపోతున్నారు.తన అనుచరులతో దాడులు చేయించడంతో పాటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆ వృద్ధురాలు ఉన్నతాధికారుల ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు. బాధితులు ఒకవైపు నగరంలో ప్రశాంత వాతావరణాన్ని కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అంటూ పాలకులు, పోలీస్ అధికారులు చెబుతున్నప్పటికీ కొందరు నాయకులు ఇలా రెచ్చి పోతూ ఉండటం తో నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా సంజయ్ గాంధీ నగర్ లో జరిగిన ఘటన ఇందుకు తార్కాణం గా ఉంది. బాధితురాలు ఇవాళ నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై ఇప్పటి వరకు ఐదవ పట్టణ పోలీసులు మాత్రం కిమ్మనకుండా ఉండడం వెనుక ఆంతర్యమేమిటి అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. బాధితులు మాత్రం తమకు న్యాయస్థానాల ద్వారా సర్వ హక్కులు కలిగి ఉన్న భూమిలో మాజీ నాయకుడు, ఆయన అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారని అధికారుల దృష్టికి తెచ్చారు.

Also read

Total Page Visits: 192 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed