SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

విజయనగరంలో వరుస చోరీలు

1 min read

విజయనగరంలో గురువారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. స్థానిక ఓరుగంటి వారి వీధి లో నివాసం ఉంటున్న పేరి నాగేశ్వరరావు ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళం పగులగొట్టి లోపలకు ప్రవేశించిన దొంగలు.. మొత్తం 10 తులాల బంగారం, 50 వేల రూపాయల నగదు అపహరించుకుపోయారు. నాగేశ్వరరావు తిరుపతి యాత్రకు వెళ్లగా, అతని కుటుంబ సభ్యులు ఇంటి పైఅంతస్తులో ఉన్న గదుల్లో నిద్రించారు. ఈ సమయంలో తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా ఇంటిని గమనిస్తున్న దొంగలు.. ఇంటి యజమాని లేని సమయం, ఈ చోరీకి పాల్పడ్డారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొద్దున్నే లేచి కింది అంతస్తులోకి వచ్చిన కుటుంబ సభ్యులు ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్‌ పోలీసులు క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో పరిశీలించారు. కస్పా హైస్కూల్‌ సమీప ప్రాంతంలోని 10 ఇళ్లలో కూడా చోరీలు జరిగాయి. ఈ చోరీల్లో 10 ఇళ్లలో సెల్‌ ఫోన్లు, నగదును దొంగలు అపహరించుకుని పోయినట్టు పోలీసులు గుర్తించారు. ఈ చోరీలకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు.

Also read

Total Page Visits: 35 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed