SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మరో వ్యక్తితో కలిసి భర్తను హతమార్చిన భార్య

1 min read

హిందూపురం టౌన,: సరిగా 13నెలల క్రితం ఓ వ్యక్తిని కాళ్లు చేతులుకట్టేసి చెరువు గుంతలో పడేసిన కేసును ఎట్టకేలకు పరిగి పోలీసులు ఛేధించారు నిందితులను అరె్‌స్టచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం హిందూపురం సర్కిల్‌ కార్యాలయం వద్ద సీఐ హమీద్‌ఖాన, పరిగి ఎస్‌ఐ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. 2020జూన 10న పరిగి చెరువులో మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే చేతులు, కాళ్లు కట్టేసి పడేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే మృతిచెందినది గోరంట్ల కిష్టప్పగా గుర్తించారు. దీంతో అప్పట్లో అతని భార్య అక్కమ్మ తన భర్తను హత్యచేసి చెరువుగుంతలో వేసినట్లు ఫిర్యాదుచేసింది. దీనిపై కేసు నమోదుచేసి అప్పటి సీఐ ధరణికిషోర్‌ విచారణచేపట్టారు. కానీ కేసుకు సంబంధించిన నిందితులను పట్టుకునేందుకు ఆనవాళ్లు లేకపోవడంతో ఏడాదికాలం పోలీసులు ప్రయత్నించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీఐ హమీద్‌ఖాన తనదైన శైలిలో విచారణ చేపట్టారు. హత్యకు గురైన కిష్టప్ప భార్యను విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకుంది.

హత్య చేయడానికి గల కారణాలు

హత్యకు గురైన గోరంట్ల కిష్టప్ప తన ఇంటిలోనే బాడుగకు ఉన్న ఈడిగ వెంకటరమణప్ప భార్య సావిత్రమ్మతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు.

Also read

ఈ నేపథ్యంలో సావిత్రమ్మపై కోపం పెంచుకున్న అక్కమ్మ, సావిత్రమ్మ భర్త వెంకటరమణప్పతో కలిసి ఎలాగైనా తన భర్తను హతమార్చాలని ప్లాన వేశారు. అంతేకాక హతుడు గోరంట్ల కిష్టప్ప, సావిత్రమ్మలు ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిద్దామని నిర్ణయించుకున్నారు. ఈ తరుణంలో వారు ఇతర ప్రాంతాలకు వె ళ్తే తనకు మర్యాద పోతుందని భావించి ఈడిగ వెంకటరమణప్ప, అక్కమ్మలు కలిసి గత యేడాది జూన 9న తెల్లవారుజామున ఆరుబయట నిద్రిస్తున్న గోరంట్ల కిష్టప్ప గొంతును గట్టిగా నులిమి హత్యచేశారు. అనంతరం తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి సమీపంలోని పరిగి చెరువులో నీటికుంటలో పడేశారు. ఏమి తెలియనట్లు అక్కమ్మ పరిగి పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేసింది. దీనిపై లోతుగా విచారణ చేయగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. ఆదివారం ఉదయం వీఆర్‌ఓ వద్ద లొంగిపోగా పోలీసులు అరె్‌స్టచేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.

Total Page Visits: 96 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed